Rashmika Mandanna: నేషనల్ క్రష్ కు స్వల్ప ప్రమాదం ! వైరల్ అవుతోన్న ర‌ష్మిక ఎమోషన్ పోస్ట్ !

నేషనల్ క్రష్ కు స్వల్ప ప్రమాదం ! వైరల్ అవుతోన్న ర‌ష్మిక ఎమోషన్ పోస్ట్ !

Rashmika Mandanna: సోష‌ల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌ గా ఉండే నేషనల్ క్రష్ ర‌ష్మిక మంద‌న్నా… ఓ నెల రోజుల నుండి పెద్దగా కనిపించడం లేదు. అయితే టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి బసమార్చిన ఈ నేషనల్ క్రష్ అక్కడ బిజీగా ఉంటుంది అని అందరూ అనుకున్నారు. అయితే ఈ నెల రోజులు ఆమె సోషల్ మీడియాకు దూరంగా ఉన్న కారణాన్ని స్వయంగా వివరించిన రష్మిక(Rashmika Mandanna)… తన అభిమానులను ఆందోళనకు గురిచేసింది. ‘‘కొన్ని రోజులుగా నేను సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండటం లేదు. అలాగే పబ్లిక్‌లో కనిపించడం లేదు. కానీ, ఇందుకు ఓ కారణం ఉంది. నాకు చిన్న ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి కోలుకునే క్రమంలో వైద్యుల సలహాల మేరకు ఇంట్లోనే ఉంటున్నాను. ప్రస్తుతం నాకు బాగానే ఉంది.

Rashmika Mandanna Health Updates

అయితే ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రధాన్యత కల్పించుకోండి. ఎందుకంటే జీవితం చాలా చిన్నది. అసలు రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందుకే ప్రతిరోజూ సంతోషంగా ఉండండి’’ అంటూ పోస్ట్ చేసింది రష్మికా మందన్నా. ప్ర‌స్తుతం వైద్యుల సూచ‌న మేర‌కు ఇంట్లోనే ఉంటున్నాన‌ని, త్వరలోనే మళ్లీ షూటింగ్స్ కు హాజరవుతాన‌ని రష్మిక తెలిపింది. ఇప్పుడీ పోస్టు సోషల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతుంది.

ఇదిలాఉండ‌గా అస‌లు ప్ర‌మాదం ఎలా జ‌ర‌గింది, షూటింగ్‌లో అయిందా లేక ట్రావెలింగ్‌లో ఏమైనా అయిందా అనే విష‌యాన్ని చెప్ప‌లేదు. ర‌ష్మిక స్పీడుగా కోలుకోవాల‌ని ఆమె అభిమానులు దేవుళ్ళనున ప్రార్దిస్తున్నారు. ఇక ర‌ష్మిక న‌టించిన అల్లు అర్జున్ ‘పుష్ప: ది రూల్‌’, విక్కీ కౌశల్‌ ‘ఛావ’, ధనుష్‌–నాగార్జునల ‘కుబేర’ సినిమాలు ఈ డిసెంబ‌ర్‌ లో విడుద‌ల‌వనుండ‌గా స‌ల్మాన్‌ ఖాన్‌ తో చేస్తున్న బాలీవుడ్ చిత్రం సికింద‌ర్ వ‌చ్చే సంవ‌త్స‌రం రంజాన్‌కు రిలీజ్ కానుంది. ఇవిగాక రెయిన్‌ బో, ది గర్ల్‌ఫ్రెండ్ అనే రెండు తెలుగులో చిత్రాల్లో ప్ర‌స్తుతం ర‌ష్మిక న‌టిస్తోంది.

Also Read : Vettaiyan: రజనీకాంత్ ‘వేట్టైయాన్’ నుంచి ‘మనసిలాయో..’ సాంగ్ రిలీజ్‌ !

Pushpa 2Rashmika MandannaSikandar
Comments (0)
Add Comment