Rashmika : నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోనూ టాప్ లో కొనసాగుతోంది ఈ హీరోయిన్. ఉన్నట్టుండి తను గాయపడింది. కాలి మడమ బెణకడంతో వైద్యులు తనకు విశ్రాంతి తీసుకోమని సూచించారు. దీంతో ఓ వైపు స్ట్రెచర్ సాయంతోనే తను సినిమా ప్రమోషన్స్ చేసింది. దీనిపై తీవ్ర ఆందోళనకు గురయ్యారు అభిమానులు. ప్రస్తుతం ఏ హీరోయిన్ కు లేనంతటి బజ్ తనకు వచ్చేసింది. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు రష్మిక(Rashmika) తన గాయం మానాలంటే ఇంకా 9 నెలల సమయం పడుతుందని చెప్పింది. ఈ మధ్య కాలంలో తను నటించిన మూడు సినిమాలు కలిపి వసూలు చేసింది అక్షరాల రూ. 3 వేల కోట్లు . ఇది నమ్మశక్యం కాని నిజం.
Rashmika Mandanna responds on her Leg Injury
తన కోసం దర్శక, నిర్మాతలు క్యూ కడుతున్నారు. తను నటిస్తే చాలు అని కోరుకుంటున్నారు. ఎంతైనా అడ్వాన్స్ చెల్లించేందుకు సిద్దమవుతున్నారు. పుష్ప2 బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం దేశంలోనే అత్యధిక వసూలు చేసిన 2వ చిత్రంగా చరిత్ర సృష్టించింది. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. రూ. 1867 కోట్లు కలెక్షన్స్ చేసిందని ప్రకటించారు అధికారికంగా. అంతకు ముందు రణ్ బీర్ కపూర్ తో కలిసి వంగా సందీప్ రెడ్డి తీసిన చిత్రం యానిమల్. ఇది రూ. 1000 కోట్లు వసూలు చేసింది. బాలీవుడ్ ను షేక్ చేసింది. సినిమాల్లో అవకాశాలు లేక తల్లడిల్లుతున్న బాబీ డియోల్ కు తిరిగి ప్రాణం పోశాడు వంగా.
ఈ ఏడాది మరో చారిత్రాత్మక నేపథ్యం ఉన్న మూవీలో నటించింది రష్మిక మందన్నా. ఆ మూవీ ఛావా. ఇందులో విక్కీ కౌశల్ తో స్క్రీన్ షేర్ చేసింది. ఈ చిత్రం రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసింది. మరాఠా యోధుడు, వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంబాజీ మహారాజ్ భార్య ఏసుబాయి పాత్రలో రష్మిక మందన్నా కలిసి నటించింది. తాజాగా మార్చి 30న సల్మాన్ ఖాన్ తో కలిసి రష్మిక కీ రోల్ పోషించిన సికందర్ రిలీజ్ కానుంది. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. దీనిని ఏఆర్ మురగదాస్ తీశాడు.
Also Read : Beauty Samantha :ప్రకృతితో సహవాసం బతుకంతా ఆనందం