నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజాగా ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ క్షణాల్లో వైరల్ గా మారింది. తను ఇంట్లో వ్యాయామం చేస్తుండగా ఉన్నట్టుండి కాలు బెణకడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. మరో వైపు తాను హిందీలో నటించిన ఛావా మూవీ ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విక్కీ కౌశల్ తో కలిసి రష్మిక కీలక పాత్రలో నటించింది. జానే తూ సాంగ్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ మూవీని మరాఠాలో జరిగిన నిజమైన కథను తెరకెక్కించారు.
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఛాయా తీశాడు దర్శకుడు. ఇందులో శంభాజీ భార్యగా నటించింది రష్మిక మందన్న. తన నటనతో మరింత ఆకట్టుకుంది. మరో వైపు అల్లు అర్జున్ తో కలిసి చేసిన పుష్ప2 మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. ఏకంగా రూ. 2,000 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయంటూ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇది పక్కన పెడితే రష్మిక మందన్న మనుషుల్లో రోజు రోజుకు దయా గుణం లేకుండా పోతోందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. సాటి వారి పట్ల ప్రేమ..కరుణ లేక పోతే ఎలా అంటూ వాపోయింది. ప్రస్తుతం తను చేసిన ఈ వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. అంతే కాదు కైండ్ ఫుల్ పేరుతో టీ షర్ట్ కూడా ధరించింది ఈ ముద్దుగుమ్మ.