Ram Charan : రంగుల లోకంలో ఎవరు ఎప్పుడు స్టార్ అవుతారో చెప్పలేరు. అదంతా అదృష్టం మీద ఆధారపడి ఉంటుందని గతంలో నటీ నటులు అనుకునే వాళ్లు. కానీ సీన్ మారింది. కథ బాగుంటే జనం ఆదరిస్తున్నారు. కష్టపడి నటించి పర్ ఫార్మెన్స్ బాగుంటేనే లైక్ చేస్తున్నారు. లేకుంటే నిర్దాక్షిణ్యంగా సినిమా ఫెయిల్, అట్టర్ ఫ్లాప్ అంటూ ముక్కు సూటిగా చెప్పేస్తున్నారు. దీంతో దర్శక, నిర్మాతలు నానా తంటాలు పడుతున్నారు. స్టార్స్ ముఖ్యం కాదా తమకు కంటెంట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్ని కోట్లు అయినా సరే ఖర్చు చేసేందుకు వెనుకాడడం లేదు.
Ram Charan -Rashmika Mandanna Movie
తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika) సంచలనంగా మారింది. తను నటించిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. వీటిలో వంగా సందీప్ రెడ్డి తీసిన యానిమల్ కాగా సుకుమార్ తీసిన పుష్ప2 చిత్రం బిగ్ సక్సెస్ గా నిలిచింది. ఇక ఈ ఏడాది మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ నటించిన ఛాయ చిత్రంలో తను భార్య ఏసు బాయిగా నటించింది. ఈ చిత్రం మరాఠాను ఊపేస్తోంది. భారీ ఎత్తున కలెక్షన్ల తో దూసుకు పోతోంది. దీంతో అటు రెమ్యునరేషన్ ను కూడా పెంచేసింది ఈ ముద్దుగుమ్మ.
తాజాగా ఓ వార్త టాలీవుడ్ లో గుప్పుమంది. అదేమిటంటే తను రామ్ చరణ్ తేజతో కలిసి నటించనుందని . ప్రస్తుతం చెర్రీ బుచ్చిబాబు సనతో సినిమా షూటంగ్ లో ఉన్నాడు. ఇక సుకుమార్ తదుపరి చిత్రం రామ్ చరణ్ తో తీయబోతున్నాడు. దీంతో రష్మిక మందన్నా తప్పకుండా చెర్రీతో జతకట్టనుందని టాక్.
Also Read : Beauty Sreeleela Got Offer: బాలీవుడ్ ఆఫర్ రెమ్యూనరేషన్ సూపర్