Rashmika Mandanna: ‘పుష్ప 2’తో త్వరలో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైన అందాల తార రష్మిక మందన్నా… ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానాతో ఓ సినిమా కోసం జతకట్టబోతున్నట్లు సమాచారం. దినేష్ విజన్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ‘‘స్త్రీ’, ‘భేడియా’, ‘ముంజ్యా’ లాంటి హారర్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత దినేష్ విజన్‌తో తన రాబోయే ప్రాజెక్టు కోసం కొంత కాలంగా చర్చలు జరుపుతున్నారు ఆయుష్మాన్. ఈ చిత్రానికి ఆదిత్య సత్పోదర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆయుష్మాన్ తో జతకట్టడానికి రష్మికను ఎంపిక చేసింది చిత్ర యూనిట్. తొలిసారి కలిసి నటిస్తున్న ఈ హారర్ కామెడీలో వీరిద్దరు మునుపెన్నడూ చూడని విధంగా కనిపించనున్నారు. మడాక్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థలో రాబోతున్న ఈ ప్రాజెక్టుకు ‘వాంపైర్స్ ఆఫ్ విజయ్‌నగర్’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్కిప్ట్ దశలో ఉన్న ఈ సినిమా గురించి త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.
Rashmika Mandanna Movie Updates
ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తోన్న ‘పుష్ప 2’ చివరి దశ షూటింగ్ లో బిజీగా ఉంది రష్మిక మందన్నా(Rashmika Mandanna). ఇది సెట్స్ పై ఉండగానే ప్రముఖ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టితో కలిసి ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే ఈ రెండు సినిమాకు సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. గతేడాది సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ సరసన నటించిన యానిమల్ తో బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీనికి సీక్వెల్ గా యానిమల్ పార్క్ ను తెరకెక్కించబోతున్నట్లు దర్శకుడు సందీప్ వంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో అయుష్మాన్ ఖురానాతో జతకట్టడం… ఇప్పుడు బీటౌన్ లో సంచలనంగా మారింది.
Also Read : SS Rajamouli: రాజమౌళి దంపతులకి అరుదైన గౌరవం ! ఆస్కార్స్ అకాడమీ నుంచి ఆహ్వానం !