Rashmika Mandanna : ఒకేరోజు రెండు సినిమాలతో రానున్న నేషనల్ క్రష్

ఆ మధ్య శ్రుతిహాసన్ నటించిన వీరసింహారెడ్డి , వాల్తేరు వీరయ్య సినిమాలు ఒక్క రోజు గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి...

Rashmika Mandanna : స్టార్ హీరోయిన్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ అమ్మడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. తెలుగు, తమిళ్ తో పాటు ఇప్పుడు హిందీలోనూ రాణిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా తర్వాత రష్మిక రేంజ్ పెరిగిపోయింది. ఆమె క్రేజ్ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పెరిగిపోయింది. దాంతో ఇప్పుడు ఈ చిన్నదానికి బాలీవుడ్ నుంచి కూడా క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. ఇటీవలే అక్కడ యానిమల్ సినిమాతో భారీ హిట్ అందుకుంది. అలాగే అక్కడ రెండు మూడు సినిమాలు కూడా చేసింది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ నటించిన రెండు సినిమాలు ఒకే రోజు థియేటర్స్ లో సందడి చేయనున్నాయి. ఒకే హీరోయిన్ నటించిన రెండు సినిమా ఒకే రోజు రిలీజ్ అవడం అనేది సినీ ఇండస్ట్రీలో అరుదుగా జరుగుతుంది.

Rashmika Mandanna Movies Update

ఆ మధ్య శ్రుతిహాసన్ నటించిన వీరసింహారెడ్డి , వాల్తేరు వీరయ్య సినిమాలు ఒక్క రోజు గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి. కానీ ఇప్పుడు రష్మిక నటించిన సినిమాలు ఓకే రోజు రాబోతున్నాయి. రష్మిక మందన్నకు బాలీవుడ్‌లో మంచి డిమాండ్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు విక్కీ కౌశల్‌తో రష్మిక(Rashmika Mandanna) నటిస్తున్న ‘ఛావ’ సినిమా టీజర్ రీసెంట్ గా విడుదలైంది. ఇందులో చారిత్రక కథాంశం ఉంది. ఈ టీజర్‌ను షేర్ చేసిన హీరో విక్కీ కౌశల్ విడుదల తేదీ గురించి సమాచారం ఇచ్చాడు. డిసెంబర్ 6న ‘ఛావ’ చిత్రాన్ని విడుదల చేయనున్నామని తెలిపాడు విక్కీ.

ఈ సినిమా ఛత్రపతి శివాజీ జీవిత కథతో తెరకెక్కుతోంది. అల్లు అర్జున్, రష్మిక మందన్న(Rashmika Mandanna) జంటగా నటించిన ‘పుష్ప 2’ కూడా అదే రోజు అంటే డిసెంబర్ 6న విడుదల కానుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆగస్టు 15న ఈ సినిమావిడుదల కావాల్సింది. కానీ పెండింగ్ పనుల కారణంగా విడుదల తేదీని డిసెంబర్ 6కి వాయిదా వేశారు. ఇప్పుడు ‘ఛావ’ కూడా అదే తేదీన విడుదల కానుంది. అల్లు అర్జున్, రష్మిక నటించిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈసినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది. ఈ సినిమా కోసం అభిమానులంతా ఈ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది.

Also Read : Yuvaraj Singh Biopic : వెండి తెరపైకి రానున్న యువరాజ్ సింగ్ బయోపిక్

Rashmika MandannaTrendingTrending ActressesUpdatesViral
Comments (0)
Add Comment