Rashmi Gautam: యాంకర్ రష్మీ ఇంట్లో తీవ్ర విషాదం ! వైరల్ గా మారుతన్న రష్మీ పోస్ట్ !

యాంకర్ రష్మీ ఇంట్లో తీవ్ర విషాదం ! వైరల్ గా మారుతన్న రష్మీ పోస్ట్ !

Rashmi Gautam: టాలీవుడ్ ప్రముఖ యాంకర్, నటి రష్మీ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తాతయ్య ఈనెల 17న అనారోగ్యంతో మరణించినట్లు ఆమె వెల్లడించింది. ఈ విషయాన్ని రష్మీ గౌతమ్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మా తాత నిజమైన స్త్రీవాది అని… చివరికీ మా బామ్మను స్వర్గంలో కలుసుకున్నారని ట్వీట్ చేసింది. గడిచిన ఏడాదిన్నరగా తన గురించే మాట్లాడేవారని రాసుకొచ్చింది. వారి ప్రేమ అలాంటిదని ఆమె తెలిపింది. దీనితో రష్మి ఫ్యాన్స్‌ ధైర్యంగా ఉండాలని ఆమెకు సూచిస్తున్నారు.

Rashmi Gautam..

తెలుగులో యాంకర్‌ గా కెరీర్ ‍మొదలెట్టిన రష్మీ గౌతమ్‌ పలు సినిమాల్లోనూ నటించారు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలకు యాంకరింగ్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. కేవలం యాంకర్‌గానే కాదు.. నటిగానూ సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు దూసుకెళ్తోంది. గుంటూరు టాకీస్, తను వచ్చేనంటా, అంతం, బొమ్మ బ్లాక్‌బస్టర్‌, అంతకుమించి లాంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించింది.

Also Read : Naga Chaitanya: రాజస్థాన్ వేదికగా మార్చిలో ఏడడుగులు వేయనున్న చే-శోభిత ?

Jabardasth Comedy ShowRashmi Gautam
Comments (0)
Add Comment