Ranya Rao : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది బంగారం అక్రమ రవాణా కేసు. ఈ కేసులో కర్ణాటక సినీ రంగానికి చెందిన నటి రన్యా రావును(Ranya Rao) బెంగళూరు ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. డీఆర్ఐ అధికారులు ఆమెను తనిఖీ చేశారు. ఆ వెంటనే తన నుంచి ఏకంగా 14.8 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి రన్యా రావుకు 14 రోజుల కస్టడీ విధించింది.
Ranya Rao Remanded
రన్యా రావు ఎవరో కాదు కర్ణాటకకు చెందిన ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్ కు దగ్గరి బంధువు అని సమాచారం. పలుమార్లు నటి దుబాయ్ కి వెళుతుండడాన్ని డీఆర్ఐ ఆఫీసర్స్ ఆరా తీశారు. తన వంటిపైనే కాకుండా అక్రమంగా గోల్డ్ ను తీసుకు వస్తున్నట్లు గుర్తించారు. అంతే కాకుండా తాను డీజీపీకి దగ్గరి రిలేటివ్ నంటూ చెప్పడంతో కొన్నిసార్లు కస్టమ్స్ ఆఫీసర్స్ తనిఖీల నుంచి తప్పించుకుందని గుర్తించారు.
కాగా డీఆర్ఐ ఆధ్వర్యంలోని టీం కొంత కాలం నుంచి రన్యా రావు కదలికలపై నిఘా పెట్టారు. ఇదిలా ఉండగా నటిపై ఆర్థిక నేరాల కింద కేసు నమోదు చేశారు. కస్టడీకి తరలించే ముందు ఆమెకు వైద్య పరీక్షలు చేశారు. రన్యా రావు మాణిక్య, పటాకి వంటి కన్నడ లో బిగ్ హిట్ అయిన మూవీస్ లో నటించింది.
Also Read : Beauty Samantha :ఆ చిత్రాన్ని..డైరెక్టర్ ను మరిచి పోలేను