Ranya Rao : బెంగళూరు – ప్రముఖ నటి రన్యా రావును బెంగళూరు విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి ఏకంగా 14.8 కేజీల గోల్డ్ ను స్వాధీనం చేసుకున్నారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్. గత కొంత కాలం నుంచి రన్యా రావు(Ranya Rao) కదలికలపై నిఘా పెట్టామని, మాటు వేసి పట్టుకున్నామని చెప్పారు. ఆమె పలుమార్లు బెంగళూరు నుంచి దుబాయ్ కి వెళుతోందని గుర్తించామన్నారు.
Ranya Rao Arrest
ఈ మేరకు ఎయిర్ పోర్టులో తనిఖీ చేయడం జరిగిందని, అనుకోకుండా భారీ ఎత్తున బంగారం ఆమె వద్ద నుంచి లభించిందని వెల్లడించారు. ఇదిలా ఉండగా కర్ణాటక రాష్ట్రంలో ఓ పేరు పొందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ కు రన్యా రావు దగ్గరి బంధువు అని తేలిందన్నారు. ఇదిలా ఉండగా నటిని అదుపులోకి తీసుకోవడంతో కన్నడ చలన చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది.
కాగా ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు రన్యా రావు ప్లాన్ చేసిందన్నారు. ఎక్కువగా ఆభరణాలను వంటిపై ధరించిందన్నారు. ఆమె లో దుస్తులలో బంగారు కడ్డీలను దాచి పెట్టిందన్నారు. తనిఖీ చేస్తున్న సమయంలో తాను డీజీపీ కుమార్తెనని, పోలీసులు వచ్చి రిసీవ్ చేసుకునే వారిని, ఇంటి వద్ద దించే వారని చెప్పారు.
అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో పోలీస్ సిబ్బంది, ఐపీఎస్ ఆఫీసర్ పాత్ర ఉందా లేదా అనే కోణంలో డీఆర్ఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గత 15 రోజులలో రన్యా రావు నాలుగుసార్లు దుబాయ్ ని సందర్శించిందన్నారు.
Also Read : Hero Dhanush-Nitya :నిత్య..ధనుష్ ఇడ్లీ కడై మూవీపై ఫోకస్