Ranveer Singh: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌కి అరుదైన గౌరవం లభించింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రణ్ వీర్ సింగ్ మైనపు విగ్రహాలను ఏర్పాటు చేసారు. రణ్‌వీర్ సింగ్ తన తల్లి అంజు భవ్నానీతో కలిసి ఈ మైనపు బొమ్మలను ఆవిష్కరించారు. ఒకేసారి రెండు మైనపు విగ్రహాల్ని ఏర్పాటు చేయడంతో… వాటి మధ్య నిలబడి ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు రణ్ వీర్ సింగ్. అంతేకాదు ఈ ఫోటోలో ఉన్న అసలు రణ్‌వీర్ ఎవరు ? అంటూ రణ్ వీర్… తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా క్విజ్ కాంపిటీషన్ పెట్టడంతో ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మరుతున్నాయి.
Ranveer Singh Got Appreciation
దీనితో నెటిజన్లు రణ్ వీర్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ‘ఇంతమంది ప్రముఖుల మధ్య నా మైనపు విగ్రహాల్ని చూస్తుంటే ఆనందంగా ఉంది. మర్చిపోలేని క్షణం ఇది. నా సినిమా ప్రయాణమే ఈ విజయానికి కారణం’ అంటూ రణ్ వీర్ సింగ్ సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు రణ్ వీర్ పోస్టుపై ఆయన భార్య నటి దీపిక పదుకొనె సరదాగా స్పందించారు. ‘నాకు ఇప్పుడు ముగ్గురు రణ్‌వీర్‌లు’ అని ఫన్నీ కామెంట్ పెట్టారు.
2010లో ‘బాండ్ బాజా బారాత్’ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన రణ్‌వీర్ సింగ్(Ranveer Singh)… పద్మావతి, బాజీరావ్ మస్తానీ, రామ్ లీలా, శింభ, రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ సినిమాలతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2018లో నటి దీపిక పదుకొణెను వివాహం చేసుకున్నాడు. రణ్‌వీర్ సింగ్ ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో ‘సింగం ఎగైన్’ చేస్తున్నారు.
Also Read : Hero Vikram: ‘విక్రమ్ 62’ ఫిబ్రవరిలో షురూ !