Teja Sajja : హనుమాన్ హీరో తేజ సజ్జ పై ప్రశంసల వర్షం కురిపించిన రణవీర్ సింగ్

ఆయనను ఎవరైనా ప్రేమించకుండా ఉండలేరు, ఎందుకంటే ఆయన పర్సనాలిటీ, మానవత్వం అద్భుతంగా ఉంటాయి...

Teja Sajja : బాలీవుడ్ పవర్ హౌస్ రణ్‌వీర్ సింగ్ గురించి చెప్పనవసరం లేకపోవచ్చు—”You can love him or hate him, but you can’t ignore him.” అంటే రణ్‌వీర్ సింగ్ తన యాక్టింగ్, డాన్సింగ్, ఎనర్జీతో ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. అయితే, అంతకన్నా ఎక్కువగా, ఆయన మనిషిగా, ఒక హ్యూమన్ బీయింగ్‌గా చాలా ఎమోషనల్, ప్రేమతో ఉండేవాడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఆయనను ఎవరైనా ప్రేమించకుండా ఉండలేరు, ఎందుకంటే ఆయన పర్సనాలిటీ, మానవత్వం అద్భుతంగా ఉంటాయి.

Teja Sajja Got Appreciations

ఇటు, టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ ‘తేజ సజ్జ(Teja Sajja)’ కూడా రణ్‌వీర్ సింగ్‌పై తన ప్రేమను చాటుకున్నారు. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జకు, బాలీవుడ్ పవర్ హౌస్ రణ్‌వీర్ సింగ్ నుండి ప్రశంసలు వచ్చాయి. ఈ కాంప్లిమెంట్‌ను తేజ సజ్జ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

తేజ రాసినట్లుగా, “ఈ ఏడాది ముగిసే దశలో, నేను అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్‌ను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇది నాకు చాలా పర్సనల్, చాలా కాలం నుంచి నేను దాచుకున్న ఒక భావన. ఇప్పుడు అది బయట పెడుతున్నాను. నేను రణ్‌వీర్ సింగ్ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్ అందుకున్నాను. ఆయన నా పనిని, నా నటనను చాలా ప్రేమతో అభినందించారు. ఆయన చిన్న చిన్న విషయాలను కూడా బ్రేక్ డౌన్ చేసి వివరించారు. ఇది కేవలం కాంప్లిమెంట్ కాదు, నిజమైన ప్రోత్సాహం—ఇది తన హృదయ నుంచి వచ్చిన ప్రేమ.

రణ్‌వీర్ సింగ్(Ranveer Singh) అంటే నిజంగా ఎంతో మనవత్వం, దయ, ప్రేమ ఉన్నాయి. నా ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా చేసినందుకు ధన్యవాదాలు, భాయ్! Much love always!” అని పోస్ట్ చేశారు. అదే సమయంలో, ‘హనుమాన్’ చిత్రానికి దర్శకుడు ప్రశాంత్ వర్మ, రణ్‌వీర్ సింగ్‌తో “రాక్షస్” అనే మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. కానీ ఈ ప్రాజెక్టులో క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా సినిమా రద్దైంది. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ పాత్రను ప్రభాస్‌తో ‘బ్రహ్మ రాక్షాస్’గా హోంబలే ఫిల్మ్స్ నిర్మాణంలో తీసే ప్రక్రియ మొదలైంది.

Also Read : Amaran OTT : ఓటీటీకి సిద్ధమవుతున్న శివకార్తికేయన్, సాయి పల్లవి ‘అమరన్’

ranveer singhTeja SajjaTrendingUpdatesViral
Comments (0)
Add Comment