Ranveer Singh: బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్(Ranveer Singh) వరుస సినిమాలతో జోరు మీద ఉన్నాడు. ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సింగమ్ అగైన్’ తో సంగ్రామ్ భలేరావ్ గా అలరించేందుకు సిద్ధమవుతున్న… ఈ మల్టీ ట్యాలెంటెడ్ హీరో తరువాత డాన్ 3 లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే డాన్ 3 సినిమా షూటింగ్ కంటే మరో సినిమాకు ముందే మరో సినిమాలో నటించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు అదిత్య ధర్ తో అతి త్వరలో ఓ సినిమాని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. దానికి ఇప్పటికే ‘ధురంధర్’ అనే టైటిల్‌ని ఖరారు చేసారు. ‘ఆధిత్య ధర్, రణ్ వీర్ సింగ్ కలయికలో రానున్న తొలి చిత్రం కావడంతో ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ పై భారీగా అంచనాలు ఉన్నాయి.
Ranveer Singh Movie Updates
ఇండియన్ ఇంటెలిజెన్స్ నేపథ్యంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ లో బాలీవుడ్ కథానాయకులు ఆర్.మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా అతి త్వరలో ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో స్వర్ణయుగంగా పిలుచుకునే కొన్ని సంవత్సరాల కథను… రా ఏజెంట్ల ప్రపంచాన్ని ‘ధురంధర్’తో ప్రేక్షకులకు సరికొత్తగా పరిచయం చేయనున్నారు. ఈ నెల 25 నుంచి థాయ్‌లాండ్‌లో చిత్రీకరణను ప్రారంభించనున్నారు. త్వరలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాల్ని అధికారికంగా వెల్లడించనున్నారని రణ్ వీర్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
Also Read : Trisha-Brinda Series : త్రిష మొట్టమొదటి వెబ్ సిరీస్ ‘బృంద’ రిలీజ్ అప్డేట్