Rani Mukerji: రాణీ ముఖర్జీ ‘మర్దానీ’కి పదేళ్ళు ! ‘మర్దానీ 3’ను ప్రకటించిన యశ్ రాజ్ ఫిల్మ్స్ !

రాణీ ముఖర్జీ ‘మర్దానీ’కి పదేళ్ళు ! ‘మర్దానీ 3’ను ప్రకటించిన యశ్ రాజ్ ఫిల్మ్స్ !
Rani Mukerji: రాణీ ముఖర్జీ ‘మర్దానీ’కి పదేళ్ళు ! ‘మర్దానీ 3’ను ప్రకటించిన యశ్ రాజ్ ఫిల్మ్స్ !

Rani Mukerji: బాలీవుడ్‌ సీనియర్ హీరోయిన్‌ రాణీ ముఖర్జీ(Rani Mukerji) లీడ్‌ రోల్‌ లో నటించిన సినిమా ‘మర్దానీ’. ఈ సినిమాకు ప్రదీప్‌ సర్కార్‌ దర్శకత్వం వహించారు. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమా 2014 ఆగస్టు 22న విడుదలై బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో శివానీ శివాజీ రాయ్‌ అనే పవర్‌ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో రాణీ ముఖర్జీ నటించారు.న్యాయం కోసం పోరాడే వారి కోసం ధైర్యంగా నిలబడే పాత్రలో తనదైన నటనతో ఆమె ఆకట్టుకున్నారు. అంతేకాదు… కష్టాల్లో ఉన్న వారిని కాపాడటం కోసం ఎంతటి రిస్క్‌ అయినా చేసే రోల్‌లో అద్భుతంగా నటించి, మెప్పించారు.

Rani Mukerji…

‘మర్దానీ’కి సీక్వెల్‌గా రాణీ ముఖర్జీ లీడ్‌ రోల్‌లోనే ‘మర్దానీ 2’ సినిమా రూపొందింది. గోపీ పుత్రన్‌ దర్శకత్వంలో యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమా 2019 డిసెంబరు 13న రిలీజై, సూపర్‌ హిట్‌గా నిలిచింది. దీనితో సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజీగా మారిన ‘మర్దానీ’ సినిమా విడుదలై పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘మర్దానీ 3’కి సంబంధించిన వీడియోను రిలీజ్‌ చేసింది యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌. మళ్లీ శివానీ శివాజీ రాయ్‌గా రాణీ ముఖర్జీ నటన చూడ్డానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉండండి అని మేకర్స్‌ పేర్కొన్నారు. దీనితో శివానీ శివాజీ రాయ్‌ గా రాణీ ముఖర్జీ… మరోసారి ‘మర్దానీ 3’ ద్వారా ప్రేక్షకులను పలకరించనుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది.

Also Read : Superstar Rajinikanth: మారి సెల్వరాజ్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ కొత్త సినిమా !

Mardaani 3Rani MukerjiYash Raj Films
Comments (0)
Add Comment