Ranbir Yash Movie : రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలంటే ఆది పురుష్ అనే పేరు గుర్తుకు వస్తుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమాపై అభిమానుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా ఈ సినిమాలో శ్రీరాముడు, రావణుడు, ఆంజనేయస్వామి పాత్రలను చూపించిన తీరు ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Ranbir Yash Movie Updates
అయితే తాజాగా సంక్రాంతి సందర్బంగా హనుమంతుడి కథతో తెరకెక్కిన హనుమాన్ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ప్రస్తుతం భారీ విజయాన్ని అందుకుంది. అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం మెగా బడ్జెట్‌లో ఆది పురుష్ కూడా చేయలేనిది సాధించింది.
తాజాగా బాలీవుడ్ ‘దంగల్’ దర్శకుడు నితీష్ తివారీ రామాయణం ఆధారంగా సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాలో నటీనటుల ఎంపికకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
శ్రీ రాముడిగా రణబీర్ కపూర్(Ranbir Kapoor), సీతమ్మగా సాయి పల్లవి, రావణాసురుడిగా కన్నడ రాక్ స్టార్ యష్ చాలా రోజులుగా ఈ వార్త హల్ చల్ చేస్తుంది. ముగ్గురు నటీనటుల పేర్లు ప్రకటించడంతో సినిమాపై మరింత ఉత్సాహం పెరిగింది.
ఈ విషయాన్ని బాలీవుడ్ ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్(Taran Adarsh) ఓ ట్వీట్‌లో ధృవీకరించారు. రామాయణం మూడు భాగాలుగా రానుందని చెప్పారు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ కూడా ఈ చిత్రంలో భాగమని ప్రచారం జరిగింది, అయితే ఇంకా అధికారిక ప్రకటన లేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా చిత్రీకరణ వచ్చే నెలలో ప్రారంభం కావచ్చని వినికిడి. అంతేకాదు సినిమా టీమ్ అంతా ఒక్కసారి అయోధ్యకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాతే సినిమాను అధికారికంగా ప్రకటించి నటీ నటుల వివరాలు వెల్లడిస్తారట. ఈ సినిమాలో రాముడిగా నటించేందుకు రణ్‌బీర్ కపూర్ ఇప్పటికే మాంసాహారం మానేసి సినిమాకు సిద్ధమవుతున్నాడు. త్వరలో యష్, సాయి పల్లవి కూడా ఈ సినిమా కోసం కసరత్తులు చేయనున్నారు.
మరి ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేక బాక్సాఫీస్ వద్ద ఆది పురుష్ సినిమాలా భారీ ఫ్లాప్ అవుతుందా అనేది చూడాలి.
Also Read : Lavanya Tripathi : వరుణ్ లావణ్యల రీల్ లైఫ్ పై స్పందించిన లావణ్య త్రిపాఠి