Ranbir Kapoor: రణ్ బీర్ కపూర్… భారత చలన చిత్ర పరిశ్రమలో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ నటుడు రిషి కపూర్ వారసుడిగా 2007లో బాలీవుడ్ లో అడుగుపెట్టిన రణ్ బీర్… మొదటి సినిమా సవారీయతోనే ఫిల్మ్ ఫేర్ అవార్డు గెలుచుకున్నారు. ఆ తరువాత రాజనీతి, రాక్ స్టార్, బర్ఫీ, తమషా, సంజు, బ్రహ్మాస్త్ర వంటి సినిమాలతో తన నట విశ్వరూపం చూపించి బాలీవుడ్ లో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోల్లో ఒకరిగా నిలిచారు. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్(Ranbir Kapoor), రష్మిక, బాబీ డియోల్, అనిల్ కపూర్, త్రిప్తి డిమ్రి ప్రధాన పాత్రల్లో తాజాగా తెరకెక్కించిన యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.
Ranbir Kapoor New Car
అయితే తాజాగా రణ్‌బీర్ కపూర్ ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ యానిమల్ హీరో దాదాపు రూ.8 కోట్ల విలువైన కొత్త బెంట్లీ కాంటినెంటల్ కారును కొనుగోలు చేశారు. ఈ లగ్జరీ కారులో ముంబైలోని తన నివాసానికి వెళ్తూ కెమెరాలకు చిక్కారు. కాగా.. గతేడాది సైతం బెల్ గ్రేవియా గ్రీన్ ఎక్స్‌టీరియర్స్‌తో కూడిన అత్యంత ఖరీదైన రేంజ్ రోవర్‌ను కొనుగోలు చేశాడు. ఇదిలా ఉంటే బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్‌ను రణ్‌బీర్ కపూర్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ రాహా కపూర్ అనే కూతురు జన్మించారు. ఇటీవలే తమ కూతురి కోసం దాదాపు రూ.250 కోట్లతో ఇంటిని నిర్మించి ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే అత్యంత పిన్న వయసులోనే కోట్ల ఆస్తులున్న స్టార్ కిడ్‌గా రికార్డ్ సృష్టించనుంది. కాగా.. ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్.. నితీష్ తివారీ తెరకెక్కించనున్న రామాయణంలో నటించనున్నారు.
Also Read : Trivikram Srinivas: నితేశ్ తివారీ ‘రామాయణ’కు త్రివిక్రమ్ మాటలు ?