Rana Daggubati: దగ్గుబాటి రానా హీరోగా తేజ డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘రాక్షస రాజా’. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా తరువాత దర్శకుడు తేజతో చేస్తున్న రెండో సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు సంబంధిచి ఓ క్రేజీ అప్ డేట్ ను చిత్ర యూనిట్ అందించింది. ఈ సినిమాలో రానాతో పాటుగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా నటిస్తున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం. బావా బామ్మర్దుల కథతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో… రానా(Rana Daggubati) బావ పాత్రలో మోహన్ లాల్ కనిపిస్తారని తెలుస్తుంది. బావ ఆనందం కోసం ఏదైనా చేసే బామ్మర్ది పాత్రలో మోహన్ లాల్ కనిపిస్తారని టాలీవుడ్ టాక్. బావకి అధికారం కట్టబెట్టి ఆయన కళ్లల్లో ఆనందం చూసేందుకు బామ్మర్ది ఏదైనా చేస్తాడట. దీనితో రానా సినిమాలో మలయాళ సూపర్ స్టార్ కూడా భాగం కావడంతో దగ్గుబాటి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారట.
Rana Daggubati Movie Updates
సొంత భాష మలయాళంలో ఎన్నో ప్రయోగాలు చేస్తూ… ఎలాంటి కథలో అయినా, ఎలాంటి పాత్రలో అయినా తన విలక్షణ నటనతో మెప్పించే మోహన్ లాల్ తేజ డైరెక్షన్ లో వస్తున్న రాక్షస రాజా సినిమాతో కూడా ఆడియన్స్ ని మెప్పించాలని చూస్తున్నారు. ఆల్రెడీ తేజ డైరెక్షన్ లో నేనే రాజు నేనే మంత్రి సినిమా చేసిన రానా(Rana Daggubati) ఆ సినిమాతో హిట్ అందుకున్నాడు. మళ్లీ ఇన్నాళ్లకు రాక్షస రాజు చేస్తున్నాడు. దర్శకుడు తేజ, గతేడాది రానా సోదరుడు అభిరామ్ హీరోగా ‘అహింస’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అహింస పోయినా సరే… రానా తేజాకి మళ్లీ అవకాశం ఇచ్చాడు రానా.
కథ, కథనం బాగా రావడంతోనే ఈ సినిమాతో తేజని నమ్మడానికి సిద్ధమయ్యారట రానా. ఈ సినిమాతో పాటుగా రానా లైన్ లో మరో రెండు భారీ సినిమాలు కూడా ఉన్నాయి. కాస్టింగ్ విషయంలో లీడ్ పెయిర్ తప్ప మిగతా వారందరినీ తేజ కొత్త వారికే ప్రాధాన్యత ఇస్తాడు. కానీ రాక్షస రాజా కథ హీరోతో పాటు మరో బలమైన పాత్ర కూడా ఉండడంతో మోహన్ లాల్ ని ఆ రోల్ కి ఎంపిక చేశారట. మలయాళంలో తన సినిమాలు చేస్తూ మిగతా భాషల్లో ఎలాంటి క్యారెక్టర్స్ వచ్చినా నో అనకుండా చేస్తున్నారు మోహన్ లాల్. మరి రానాతో కలిసి చేస్తున్న ఈ రాక్షస రాజులో ఆయన మార్క్ ఎలా చూపిస్తారన్నది చూడాలి.
Also Read : Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ సినిమాను తొలగించిన ప్రముఖ ఓటీటీ సంస్థ ! ఎందుకంటే?