Rana Daggubati : రానా దగ్గుబాటి కథా-ఆధారిత చిత్రాలకు నిర్మాతగా కూడా పనిచేస్తున్నాడు. తాజాగా ఆయన రెండు సినిమాలను ప్రకటించారు. అయితే నటుడిగా విరాట పర్వం తర్వాత సినిమాల్లో నటించలేకపోయాడు. తేజ దర్శకత్వంలో ఓ సినిమా ఎనౌన్స్ చేసినా ఇంకా కార్యరూపం దాల్చలేదు. ‘వెట్టయాన్’ చిత్రంలో రజనీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సిరీస్ రెండో భాగంలో ‘రానా నాయుడు’ లో కూడా నటించనున్నాడు.
Rana Daggubati Movies Update
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. కొత్త దర్శకుడు కిషోర్ కథకి అనుమతి ఇచ్చాడు. ఈ చిత్రాన్ని అల్కా మీడియా వర్క్స్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో కథానాయికగా శ్రీనిధి శెట్టి పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది.
Also Read : Telugu Film Industry : ఎఫ్.డి.సి చైర్మన్ పదవికి నట్టి కుమార్ పోటీ