Rana Daggubati : తన ఫ్యూచర్ ప్లాన్స్ పై క్లారిటీ ఇచ్చిన రానా దగ్గుబాటి

విరాట పర్వం తర్వాత ఆయన 'స్పై' సినిమాలో స్మాల్ కేమియాతో పాటు 'వేట్టయాన్' సినిమాలో విలన్ గా యాక్ట్ చేశాడు...

Rana Daggubati : టాలీవుడ్ లో మోస్ట్ సెన్సిబుల్ యాక్టర్, ప్రొడ్యూసర్, హోస్ట్ గా రానా దగ్గుబాటికి మంచి పేరుంది. అందరి హీరోల ఫ్యాన్స్ ఆయనని అభిమానిస్తారు. చిన్న, పెద్ద అనే సినిమాలు అనే తేడాలేకుండా ఆయన అన్ని చోట్లో ప్రమోట్ చేస్తూ ఉంటారు. కానీ.. ఆయన తన యాక్టింగ్ కెరీర్ లో మాత్రం కాస్త వెనకబడ్డాడు. చివరగా 2022లో వచ్చిన విరాట పర్వంలో యాక్ట్ చేశాడు. అయితే రానా(Rana Daggubati) నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటని అందరు ఆరాలు తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన ఫ్యూచర్ ప్లాన్స్ పై క్లారిటీ ఇచ్చాడు.

Rana Daggubati Comment

విరాట పర్వం తర్వాత ఆయన ‘స్పై’ సినిమాలో స్మాల్ కేమియాతో పాటు ‘వేట్టయాన్’ సినిమాలో విలన్ గా యాక్ట్ చేశాడు. ప్రస్తుతం ‘ది రానా దగ్గుబాటి’ షోతో ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా ఈ టాక్ షోలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను మూడు సినిమాలు చేస్తున్న, కానీ వాటికి కాస్త సమయం పడుతుందన్నారు’. రానా తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘హిరణ్య కశ్యప’ కొన్నేళ్ళ క్రితమే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

మొదట ఈ సినిమా కోసం దర్శకుడిగా గుణశేఖర్ పేరును పరీశీలించారు. తర్వాత ఆయనని తొలిగించారు. కథను మాత్రం త్రివిక్రమ్ అందించనున్నాడు. మంచి డైరెక్టర్ దొరకగానే ఈ సినిమా పట్టాలెక్కనుంది. దీనిపై రానా మాట్లాడుతూ.. ‘ఈ సినిమా పెద్ద స్కేల్ లో నిర్మించనున్నాం. అమర్ చిత్ర కథల నుండి స్క్రిప్ట్ తీసుకున్నాం. ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి’ అన్నారు. నెక్స్ట్ తేజతో చేయాల్సిన ‘రాక్షస రాజు’ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘ మా కాంబినేషన్ లో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాకి మించి ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నాం. కథని ఇంకా మెరుగుపరచడంలో టీమ్ ఉందన్నారు. ఇక నెక్స్ట్ త్రివిక్రమ్‌తో కూడా ఒక సినిమా ఉందన్నారు’. కానీ.. సినిమాకి చాలా సమయం పట్టే అవకాశం ఉంది.

Also Read : Deepfake : అగ్ర నటుడు ‘అమితాబ్ బచ్చన్’ వరకు పాకిన ‘డీప్ ఫేక్’ ముచ్చట

CommentsRana DaggubatiTrendingUpdatesViral
Comments (0)
Add Comment