Rana Daggubati : మరో సరికొత్త టాక్ షో తో వస్తున్న ‘రానా దగ్గుబాటి’

గతంలో రానా హోస్ట్ చేసిన 'నంబర్ 1 యారి' షో ఎంతో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Rana Daggubati : టాలెంటెడ్ యాక్టర్, ప్రొడ్యూసర్, హోస్ట్ ‘రానా దగ్గుబాటి(Rana Daggubati)’ సినిమాలు చేసేది తక్కువైనా ఇండస్ట్రీలో ఎప్పుడు రెలివెంట్‌గానే ఉంటారు. ఒకవైపు నిర్మాతగా కంటెంట్ ఉన్న చిన్న సినిమాలకి ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నాడు. యాక్టర్‌గా చేస్తున్నది కొన్ని సినిమాలే అయినా మంచి క్రేజి ప్రాజెక్ట్‌లను తన పర్సనాలీటి‌కి తగ్గట్లు ఎంపిక చేసుకున్నాడు. మరోవైపు లోకల్, నేషనల్, ఇంటర్ నేషనల్ తేడా లేకుండా అనేక షోస్‌ని హోస్ట్ చేసి మంచి వక్తగా పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే రానా మరోసారి తన ఓన్ షో‌తో మనందరినీ సర్ప్రైజ్ చేయబోతున్నాడు.

Rana Daggubati New Show

గతంలో రానా హోస్ట్ చేసిన ‘నంబర్ 1 యారి’ షో ఎంతో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనదైన సెన్సాఫ్ హ్యూమర్, విట్టి‌నెస్ అండ్ సెటైరికల్ కామెడీలో ‘రానా’ ఆల్వేస్ టాప్. ఈ క్రమంలోనే ఆయన అనేక అవార్డ్ ఈవెంట్స్‌తో పాటు ప్రెస్టీజియస్ ఈవెంట్‌లను హోస్ట్ చేస్తున్నాడు. దీంతో ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో రానాతో జత కట్టి ఒక సరికొత్త టాక్ షో ప్రారంభించనుంది. అదే ‘ది రానా దగ్గుబాటి షో’. తాజాగా ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ పై రానా కూల్ లుక్ లో అదిరిపోయాడు. ఈ షో అన్ని షోస్ మాదిరి కంటే చాలా స్పెషల్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇందులో క్యాండీడ్ టాక్స్‌తో పాటు ఇప్పటి వరకు స్మాల్ స్క్రీన్‌పై చూడని సరికొత్త టాస్క్‌లు చూడనున్నాం. అలాగే ‘ఆన్‌లైక్లి డ్యూయో’ అంటూ పెద్ద ప్లాన్స్ చేస్తున్నారు. ‘న్యూ హాబీస్’ అంటూ పోస్టర్‌పై రాసిన టెక్స్ట్‌లతో సగటు ప్రేక్షకులు షో ఫార్మట్‌ని ఈజీ‌గా ఊహించే విధంగా లేకుండా ప్లాన్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ షో నవంబర్ 23 నుండి ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Also Read : Bollywood Producer : ఆ సంస్థ వారు మమ్మల్ని కావాలనే మోసం చేసారు

Rana DaggubatiTrendingUpdatesViral
Comments (0)
Add Comment