RAM(Rapid Action Mission) : ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న రామ్(రాపిడ్ యాక్షన్ మిషన్) సినిమా

అటువంటి చిత్రాలలో ఒకటి ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది

RAM(Rapid Action Mission) : దేశభక్తి చిత్రం “రామ్ (రాపిడ్ యాక్షన్ మిషన్)” ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో సూర్య అయ్యల సోమయాజుల హీరోగా నటించారు. ధన్య బాలకృష్ణ కథానాయికగా నటించింది. ఓఎస్ఎం విజన్‌తో కలిసి దీపికా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రంగా నిర్మించారు. మిహిరామ్ వైనతేయ ఈ సినిమాతో తన దర్శకత్వ నైపుణ్యాన్ని నిరూపించుకున్నాడు.

RAM(Rapid Action Mission) OTT Updates

రామ్ (రాపిడ్ యాక్షన్ మిషన్)(RAM) మొదటి సినిమా అయినప్పటికీ కథానాయకుడు మరియు దర్శకుడు ఇద్దరికీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. థియేటర్లలో సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దేశభక్తికి సంబంధించిన సినిమా అయినప్పటికీ అన్ని రకాల ఎలిమెంట్స్, ఎమోషన్స్ అన్నీ కలగలిసి అన్ని వర్గాల ప్రేక్షకులను టచ్ చేసింది. సంగీతం, ఆర్ఆర్, కెమెరా వర్క్ ఇలా అన్ని ప్రొఫెషన్స్ కి హై రేటింగ్ ఉన్న సంగతి తెలిసిందే.

అటువంటి చిత్రాలలో ఒకటి ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. దీపికాంజలి వడ్లమాని నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం OTT ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది. సినిమా మిస్ అయిన వారి కోసం, అమెజాన్ ప్రైమ్‌లో మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ దేశభక్తి చిత్రాన్ని ఆస్వాదించవచ్చు.

Also Read : Gaami OTT : త్వరలో ఓటీటీలో అలరించనున్న విశ్వక్ సేన్ ‘గామి’

MovieNewOTTTrendingUpdatesViral
Comments (0)
Add Comment