Ramcharan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరో ఇంటర్నేషనల్ అవార్డు దక్కించుకున్నాడు. అమెరికాలో నిర్వహించే పాప్ గోల్డెన్ అవార్డుల్లో భాగంగా ఈసారి రామ్ చరణ్… గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ అవార్డు దక్కించుకున్నాడు. ఈ అవార్డు కోసం షారుఖ్ ఖాన్, దీపిక పదుకొణే, అర్జున్ మాథుర్, ఆదా శర్మ, రాశి ఖన్నా, విశేష్ భన్సాల్, రిద్ధి డోగ్రా కూడా నామినేట్ అయ్యారు. అయితే వీరందరినీ వెనక్కి నెట్టి రామ్ చరణ్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు పాప్ గోల్డెన్ అవార్డ్స్ కమిటీ అధికారికంగా రామ్ చరణ్(Ramcharan) పేరును ప్రకటించింది. ఇది ఇలా ఉండగా పాప్ గోల్డెన్ అవార్డ్స్ ఇతర కేటగిరీల్లో అంతర్జాతీయ పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్, కొరియా మ్యూజిక్ బ్యాండ్ బీటీఎస్ కూడా విజేతలుగా నిలిచారు.
Ramcharan – ఆర్ఆర్ఆర్ తరువాత గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్
దర్శక ధీరుడు రాజమౌళి దర్వకత్వంలో తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా చాలా గుర్తింపు తెచ్చుకున్న చరణ్… ఇటీవల హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ స్పాట్ లైట్ అవార్డును దక్కుంచుకున్నారు. వెంటనే ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటను ఆస్కార్ అవార్డు వరించింది. ఆస్కార్ అవార్డు అందుకున్న తరువాత రామ్ చరణ్ పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమ్రోగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అమెరికాలో నిర్వహించే పాప్ గోల్డెన్ అవార్డు దక్కించుకున్నాడు.
గేమ్ ఛేంజర్ తో బిజీగా ఉన్న రామ్ చరణ్
పాన్ ఇండియా దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ఉప్పెన ఫేం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ తరువాత చిత్రం సెట్స్ పైకి వెళ్ళబోతుంది. ఉత్తరాంధ్రా గ్రామీణ క్రీడ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహామాన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : Tripti Dimri: వారంలో 24లక్షల ఫాలోవర్స్ ను పెంచుకున్న ‘యానిమల్’ బ్యూటీ