Ramayan: ‘రామాయణ’ సినిమా సెట్ ఫోటోలు లీక్ ! దర్శకుడు నితీశ్ కఠిన నిర్ణయం !

‘రామాయణ’ సినిమా సెట్ ఫోటోలు లీక్ ! దర్శకుడు నితీశ్ కఠిన నిర్ణయం !

Ramayan: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న అతి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘రామాయణ’. అల్లు అరవింద్ నిర్మాతగా భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా మూడు భాగాలుగా తెరకెక్కించబోయే ఈ ‘రామాయణ’ సినిమాలో రాముడిగా రణ్ బీర్ కపూర్(Ranbir Kapoor), రావణుడిగా యశ్‌, విభీషణుడిగా విజయ్‌ సేతుపతి, హనుమంతుడిగా బాబీ డియోల్, సీత పాత్రలో సాయిపల్లవి, కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు సంభాషణల బాధ్యతలను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు అప్పగించినట్లు తెలుస్తోంది.

Ramayan Photos Leake

ఈ సినిమాకు సంబంధించి మొదటి పార్ట్‌ ను 2025 దీపావళికి తీసుకురావాలని మూవీ మేకర్స్ ప్లాన్‌ చేస్తున్న మూవీ మేకర్స్… ఇటీవల సినిమా షూటింగ్ ను ముంబైలో ప్రారంభించారు. అయితే గోరేగావ్ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్స్‌ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా వైరలయ్యాయి. గత రెండు రోజులుగా షూటింగ్ విజువల్స్ విస్తృతంగా బయటకొచ్చాయి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న మూవీ ఫోటోలు నెట్టిం లీక్ అవ్వడంతో దర్శకుడు నితీష్ తివారీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనితో ఆయన కఠిన నిర్ణయం తీసుకున్నారని బీ టౌన్‌ లో టాక్ వినిపిస్తోంది. ఇక నుంచి షూటింగ్‌ సెట్స్‌లో నో ఫోన్ పాలసీని అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

ఇటీవల సోషల్ మీడియాలో లీకైన చిత్రాలలో కైకేయిగా లారా దత్తా, దశరథ్‌ గా అరుణ్ గోవిల్ కనిపించారు. దీనితో ఆగ్రహానికి గురైన నితీశ్… సెట్ లో నో-ఫోన్ విధానం అమలు చేయనున్నారు. చిత్రీకరణ సమయంలో అదనపు సిబ్బంది కూడా సెట్‌ కు దూరంగా ఉండాలని ఆదేశించారు. కేవలం సన్నివేశంలో పాల్గొనే నటీనటులు, సాంకేతిక నిపుణులు మాత్రమే సెట్‌లోకి అనుమతించబడతారు. కాగా… రామాయణం కోసం రూ.11 కోట్లతో సెట్‌ను నిర్మించారు. త్వరలోనే రణ్‌బీర్‌ కపూ(Ranbir Kapoor)ర్, సాయి పల్లవి సెట్స్‌లో జాయిన్ కానున్నారు. యష్ జూలైలో షూటింగ్‌లో పాల్గొననున్నారు.

Also Read : Satyadev Kancharana: సత్యదేవ్ ‘కృష్ణమ్మ’ సినిమా టీజర్ వచ్చేసింది !

Ramayanranbir kapoorSai Pallavi
Comments (0)
Add Comment