Ramayan: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న అతి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘రామాయణ’. అల్లు అరవింద్ నిర్మాతగా భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా మూడు భాగాలుగా తెరకెక్కించబోయే ఈ ‘రామాయణ’ సినిమాలో రాముడిగా రణ్ బీర్ కపూర్(Ranbir Kapoor), సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్, విభీషణుడిగా విజయ్ సేతుపతి, హనుమంతుడిగా బాబీ డియోల్, కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల సినిమా షూటింగ్ ను ప్రారంభించుకున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆశక్తికరమైన అంశం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతోంది.
Ramayan Movie Updates
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణ’ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ సినిమాలో రావణుడి పాత్రధారి ధరించనున్న దుస్తులు, ఆభరణాలు వాడే వస్తువులు అన్నీ నిజమైన బంగారంతో తయారు చేసినవే వినియోగించనున్నట్లు సమాచారం. ఎందుకంటే రావణుడు స్వర్ణ నగరమైన లంకకు అధిపతి. ఆయన ధరించిన వస్త్రాలు కూడా పసిడి మయమేనని ఇతిహాసాల్లో చెప్పారు. అందుకే సినిమాలోనూ ఆ పాత్రను అలాగే చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. దీనితో అంత బంగారాన్ని షూటింగ్ లో ఉపయోగించడం నిజమేనా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. సాధారణంగా సోషియో ఫాంటసీ సినిమాలంటే గిల్ట్ నగలు, గ్రాఫిక్స్ సింహాసనలతో కాలం వెల్లదీసే చిత్ర నిర్మాతలు… ఈ సినిమాకోసం అంత రిస్క్ తీసుకుంటారా అని చర్చించుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో యశ్ ముఖ్య పాత్ర పోషించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. దీన్ని భారతీయ భాషలతోపాటు పలు విదేశీ భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాను.
Also Read : Keerthy Suresh : ఆ హీరోతో లిప్ లాక్ సీన్ చేసిన మహానటి…అదే హైలైట్ అంటున్న మేకర్స్