Ramayan: శ్రీరామనవమి రోజున ‘రామాయణ’ ప్రకటన ?

శ్రీరామనవమి రోజున 'రామాయణ' ప్రకటన ?

Ramayan: భారతీయ చలన చిత్ర పరిశ్రమలో బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్స్ లో ‘రామాయణ(Ramayan)’ ఒకటి. అల్లు అరవింద్ నిర్మాతగా భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా హిందీలో తెరకెక్కించబోయే ‘రామాయణ’ సినిమాకు బాలీవుడ్‌ అగ్ర దర్శకుడు నితేశ్‌ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. మూడు భాగాలుగా నిర్మాణం చేపట్టబోయే ఈ సినిమాలో రాముడిగా రణ్ బీర్ కపూర్, రావణుడిగా యశ్‌, విభీషణుడిగా విజయ్‌ సేతుపతి, హనుమంతుడిగా బాబీ డియోల్, సీత పాత్రలో సాయిపల్లవి లేదా జాన్వీ కపూర్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రాముడి పాత్ర ఆహార్యం కోసం రణ్‌ బీర్‌ కపూర్‌ స్పెషల్‌ ట్రైనింగ్‌ తీసుకుంటున్నారని బాలీవుడ్‌ సమాచారం. అలాగే డైలాగ్స్‌ స్పష్టంగా పలికేందుకు కూడా డైలాగ్‌ డిక్షన్‌ లో రణ్‌బీర్‌ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారట.

Ramayan Updates

ఇప్పటికే ప్రీ ప్రోడక్షన్ పనులను పూర్తి చేసిన చిత్ర యూనిట్… త్వరలో సినిమా షూటింగ్ ను ప్రారంభించడానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. అల్లు అరవింద్‌ తో పాటు నమిత్‌ మల్హోత్రా, మధు మంతెన నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ సినిమాకు సంబంధించిన అధికారిక వివరాలను శ్రీరామనవమి రోజున అంటే ఏప్రిల్ 17న ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది. దీనితో బాలీవుడ్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఈ సినిమా అధికారిక వివరాల కోసం ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. రామయణం అనేది బారతీయ ఇతిహాసం అయినప్పటికీ… దానికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా బాలీవుడ్ ను దాటి హాలీవుడ్ స్థాయిలో నిర్మాణం చేపడుతున్నారు మూవీ మేకర్స్.

Also Read : Saripodhaa Sanivaaram: నాని ‘సరిపోదా శనివారం’ రిలీజ్ డేట్ ఫిక్స్ !

Allu AravindRamayanranbir kapoorSai Pallavi
Comments (0)
Add Comment