Ramajogayya Sastry: తిరుమల సన్నిధిలో ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పిన టాలీవుడ్‌ రచయిత !

తిరుమల సన్నిధిలో ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పిన టాలీవుడ్‌ రచయిత !

Ramajogayya Sastry: టాలీవుడ్ సినీ రచయిత, లిరిసిస్ట్‌, సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన కుమారుడితో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. తెలుగులో గొప్ప రచయితగా పేరు తెచ్చుకున్న రామజోగయ్య శాస్త్రి… ప్రస్తుతం దేవర సినిమాకు పనిచేస్తున్నారు. స్టైలిష్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ నటిస్తున్న ఈ దేవర సినిమా నుండి తాజాగా రిలీజైన చుట్టమల్లే చుట్టేస్తావే సాంగ్‌కు లిరిక్స్ అందించారు.

Ramajogayya Sastry Comment

ఇవాళ తిరుమల దర్శన అనంతరం సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అభిమానులకు ఓ గుడ్‌ న్యూస్ చెప్పారు. ఈ నెలలో తన కుమారుడి పెళ్లి ఉందని వెల్లడించారు. అందుకే తిరుమల స్వామివారికి మొదటి ఆహ్వాన పత్రిక అందజేసేందుకు వచ్చినట్లు రామజోగయ్య తెలిపారు. కాగా.. రామజోగయ్య శాస్త్రికి హర్ష, తేజ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

Also Read : Double Ismart: ఆటో ఎక్కిన ‘డబుల్ ఇస్మార్ట్‌’ హీరో, హీరోయిన్ !

Ramajogayya SastryTirumala Tirupathi DevastanamTollywood LyricistTTD
Comments (0)
Add Comment