Ram Talluri : పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కొన్నాళ్ల క్రితం ఓ సినిమాను ప్రాజెక్ట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే! దాదాపు మూడేళ్ల క్రితం పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇప్పుడీ సినిమా గురించి నిర్మాత రామ్ తాళ్లూరి(Ram Talluri) మాట్లాడారు. తమ బ్యానర్‌లో నిర్మితమవుతోన్న ‘మెకానిక్ రాకీ’ గ్లింప్స్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన్ను ఓ జర్నలిస్ట్ పవన్ సినిమా అప్‌డేట్ గురించి అడగగా ఆయన స్పందించారు. ‘‘ ఇప్పుడు మన చేతిలో ఏం లేదు. ప్రస్తుతం ఏం జరుగుతుందో మీక్కూడా తెలుసు. మా సైడ్ వర్క్ పూర్తైంది. స్క్రిప్ట్ లాక్ చేశాం. పూజా కార్యక్రమం జరిగింది. ఇక, అంతా పవన్ చేతుల్లోనే ఉంది. వారం క్రితం ఆయన్ని కలిశా. వీలు చూసుకుని సినిమాలు చేయొచ్చు’’ అని తెలిపారు.
Ram Talluri Comment
ప్రస్తుతం పవన్‌కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో తను నటిస్తున్న చిత్రాలకు కాస్త బ్రేక్ పడింది. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. దర్శకుడు క్రిష్‌తో చేస్తోన్న ‘హరిహరవీరమల్లు’ సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’, హరీశ్ శంకర్‌తో చేయనున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. ఈ మూడు చిత్రాల షూటింగ్స్ కొంతవరకూ పూర్తయ్యాయి. ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రచారాలతో బిజీగా ఉండటంతో సినిమా షూటింగ్స్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. పవన్ – సురేందర్‌రెడ్డి ప్రాజెక్ట్‌ను 2020లోనే ప్రకటించారు. 2021లో పవన్ పుట్టినరోజును పురస్కరించుకుని లుక్ విడుదల చేశారు. ఒక వైపు హైదరాబాద్ నగరం.. మరోవైపు తుపాకీతో ఉన్న పోస్టర్‌పై ‘యథా కాలమ్.. తథా వ్యవహారమ్..’ అని ఉంది.
Also Read : Rashmika Mandanna : ఇంత మంది అభిమానంతో నా హృదయం నిండిపోయింది
Ram Talluri : పవన్ కోసం మా వైపు స్క్రిప్ట్ తో సిద్ధంగా ఉన్నాం..
ప్రస్తుతం పవన్‌కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు...