Ram Pothineni : స్కంద ప‌క్కా మాస్ మూవీ

న‌టుడు రామ్ పోతినేని కామెంట్

Ram Pothineni : స్కంద ప‌క్కా మాస్ మూవీగా ఆక‌ట్టుకుంటుంద‌ని అన్నారు న‌టుడు రామ్ పోతినేని. ఈ చిత్రం త‌ప్ప‌కుండా స‌క్సెస్ అవుతుంద‌న్నారు . స్కంద ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి బాల‌య్య బాబు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా రామ్ మాట్లాడారు.

Ram Pothineni Said Skanda is a Mass Movie

డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డం మ‌రింత ఛాలెంజ్ గా తీసుకున్నాన‌ని అన్నారు. ఆయ‌న నుంచి ప్ర‌తి సారి ఎంతో కొంత నేర్చుకుంటూనే వ‌చ్చాన‌ని అన్నారు. న‌ట‌న‌లో త‌న‌కు గురువు బాల‌కృష్ణ అని పేర్కొన్నారు. త‌న‌పై , ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను మీద అభిమానంతో ఈ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కు రావ‌డం సంతోషంగా ఉంద‌న్నారు.

అఖండ త‌ర్వాత వ‌స్తున్న చిత్రం కావ‌డంతో స్కంద‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ప్ర‌త్యేకించి సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన ట్రైల‌ర్ న‌రాలు తెగేలా ఉంది. ఎప్ప‌టి లాగే ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను త‌న‌దైన మార్క్ చూపించాడు. మాస్ డైలాగ్ ల‌తో ఆకట్టుకునేలా తీశాడు. బోయ‌పాటి అంచ‌నాల‌కు మించి రామ్ పోతినేని(Ram Pothineni) న‌టించి మెప్పించాడు. ఇక ఎస్ఎస్ థ‌మ‌న్ మ‌రోసారి మాస్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అద‌ర‌గొట్టాడు.

తియ్యాలే, పొయ్యాలే, గ‌ట్టిగా అరిస్తే తొయ్యాలే, అడ్డం వస్తే లేపాలే అంటూ రామ్ పోతినేని మాస్ డైలాగ్ మెస్మ‌రైజ్ చేసేలా ఉంది. రామ్, శ్రీ‌లీల డ్యాన్సుల‌తో అద‌రొగొట్టారు.

Also Read : Skanda Trailer : బోయ‌పాటి మార్క్ రామ్ కిరాక్

ram pothineni boyapati srini skanda movie mass
Comments (0)
Add Comment