Hero Ram-Sagar Gadi Love :’సాగ‌ర్ గాడి ల‌వ్వు’ మామూలుగా లేదుగా 

రామ్ పోతినేని..భోర్సే లుక్స్ అదుర్స్ 

Sagar Gadi Love : టాలీవుడ్ లో మోస్ట్ యంగ్ అండ్ ఎన‌ర్ట‌టిక్ హీరో ఎవ‌రైనా ఉన్నారంటే రామ్ పోతినేని(Ram Pothineni). త‌ను ఏ పాత్ర‌కైనా స‌రే ఇట్టే స‌రి పోతాడు. భావోద్వేగాల‌ను ప‌లికించ‌డంలో బెస్ట్ ప‌ర్ ఫార్మ‌ర్ గా గుర్తింపు పొందాడు. త‌ను ఈ మ‌ధ్య‌న బోయ‌పాటి శ్రీ‌నుతో న‌టించాడు. అంత‌కు ముందు పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఇస్మార్ట్ శంక‌ర్ లో న‌టించాడు. కుర్ర‌కారుకు మ‌రిచిపోలేని రీతిలో కిక్ ఎక్కించేలా చేశాడు. ఆ త‌ర్వాత సీక్వెల్ కూడా వ‌చ్చింది. కానీ ఆశించినంత‌గా ఆడలేదు.

Sagar Gadi Love Movie Updates

ప్ర‌స్తుతం మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణ సార‌థ్యంలో మ‌హేష్ బాబు పి కొత్త‌గా మూవీ తీస్తున్నాడు. ఇందులో త‌న‌కు జోడీగా అందాల ముద్దుగుమ్మ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ లో అందాల‌ను ఆర బోసిన భాగ్య‌శ్రీ బోర్సే జ‌త క‌డుతోంది. ఈ ఇద్ద‌రికి సంబంధించిన పోస్ట‌ర్స్ , లుక్స్ ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ఇదిలా ఉండ‌గా రామ్ పోతినేని సినీ కెరీర్ లో ఈ చిత్రం 22వ‌ది కావ‌డం విశేషం. దీనిపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టాడు ద‌ర్శ‌కుడు. ఈ సినిమాకు సంబంధించి ఇంకా టైటిల్ ఖ‌రారు కాలేదు. మూవీ మేక‌ర్స్ కీల‌క అప్ డేట్ ఇచ్చారు. మీకు సుప‌రిచితుడు..మీలో ఒక‌డు..మీ సాగ‌ర్ అంటూ రామ్ పాత్ర‌ను ప‌రిచ‌యం చేశారు. ఇందుకు సంబంధించిన పోస్ట‌ర్ నెట్టింట్లో వైర‌ల్ గా మారింది..హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

Also Read : Kangana Shocking Comments :నోరు పారేసుకున్న కంగ‌నా ర‌నౌత్

Bhagyashri BorseCinemaRam PothineniSagar Gadi LoveTrendingUpdates
Comments (0)
Add Comment