RGV : ముంబై – ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(RGV)కు కోలుకోలేని షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో ముంబై అంథేరీ కోర్టు సంచలన తీర్పు చెప్పింది కోర్టు. మూడు నెలల జైలు శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. ఆరేళ్ల కిందట నమోదైన కేసుకు సంబంధించి ఆర్జీవీని దోషిగా తేల్చింది. చెక్ బౌన్స్ అయ్యిందంటూ మహేష్ చంద్ర మిశ్రా శ్రీ కంపెనీ పేరుతో ఫిర్యాదు చేశారు.
RGV Got Shock..
కేసు విచారణలో భాగంగా ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు కాలేదు వర్మ. దీంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పలుమార్లు నోటీసులు జారీ చేసినా పట్టించు కోలేదు. ఇది పూర్తిగా బాధ్యతా రాహిత్యమని న్యాయమూర్తి విచారణ సందర్బంగా పేర్కొన్నారు.
గత కొంత కాలంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు రామూజీ. ఆయన మోస్ట్ టాలెంటెడ్ కలిగిన దర్శకుడిగా గుర్తింపు పొందారు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఆర్జీవీ ఈ మధ్యన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు. ఇటీవలే తను తీసిన సత్య గురించి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తానేనా ఈ సినిమా తీసింది అంటూ పేర్కొన్నారు.
కాగా వ్యూహం పేరుతో తాను తీసిన మూవీ కాంట్రావర్షీకి గురి చేసింది. ఏపీలో పలు కేసులు నమోదయ్యాయి. తనను ముందస్తుగా అరెస్ట్ చేయొద్దంటూ కోరారు. కోర్టును ఆశ్రయించారు.
Also Read : Super Star Mahesh : నమ్రతా నువ్వు లేని జీవితం శూన్యం