RGV Shocking Comments : ‘సిండికేట్’ పై ఆర్జీవీ బిజీ

త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తా

RGV : వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌ను బాలీవుడ్ లో తీసిన స‌త్య మూవీ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. 25 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్బంగా క‌న్నీటి ప‌ర్యంతం అయ్యాడు. తాను తీసిన సినిమాను తానే చూసి ఎక్స్ వేదిక‌గా స్పందించాడు. తానేనా ఈ చిత్రాన్ని తీసింది అంటూ వాపోయాడు. భావోద్వేగానికి గురైన ఆర్జీవీ(RGV) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం సినీ రంగంలో క‌ల‌కలం రేపుతోంది.

RGV Shocking Comments

ఇక నుంచి చెత్త సినిమాలు తీయ‌నంటూ ప్ర‌క‌టించాడు. ఈ సంద‌ర్బంగా త్వ‌ర‌లోనే స‌త్య‌, కంపెనీ, ఢీ లాంటి సినిమాల‌కు ధీటుగా సిండికేట్ పేరుతో సినిమా తీస్తాన‌ని వెల్ల‌డించాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఆయ‌న చేసిన ఈ కామెంట్ క్ష‌ణాల్లోనే సోష‌ల్ మీడియాను షేక్ చేసింది. వ‌ర్మ అంటేనే ఓ బ్రాండ్. త‌ను వెరీ వెరీ స్పెష‌ల్. ఇత‌ర ద‌ర్శ‌కుల‌కంటే భిన్నంగా ఉంటాడు. త‌న అభిప్రాయాల‌ను నిక్క‌చ్చిగా చెప్ప‌డంలో త‌న‌కు త‌నే సాటి.

కాగా సిండికేట్ కు సంబంధించి ఇప్ప‌టికే న‌టీ న‌టుల ఎంపిక కూడా పూర్త‌యింద‌ని స‌మాచారం. ఇందుకు సంబంధించి ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అదేమిటంటే ఆర్జీవీ తీయ‌బోయే కొత్త మూవీలో బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ , వెంకేశ్, ఫ‌హాద్ ఫాసిల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించ బోతున్నారంటూ జ‌రుగుతున్న ప్రచారంపై స్పందించారు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఇంకా ఖ‌రారు చేయ‌లేద‌ని పేర్కొన్నాడు.

Also Read : Beauty Kavitha Samharam : దుష్ట శ‌క్తుల‌పై ‘సంహారం’ పోరాటం

CommentsRam Gopal VarmaViral
Comments (0)
Add Comment