Ram Gopal Varma: థియేటర్లలో ‘వ్యూహం’ ! ఓటీటీలో ‘శపథం’ !

థియేటర్లలో ‘వ్యూహం’ ! ఓటీటీలో ‘శపథం’ !

Ram Gopal Varma: రామదూత క్రియేషన్స్‌ బ్యానర్‌పై దాసరి కిరణ్‌ కుమార్‌ నిర్మాతగా వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన సినిమాలు ‘వ్యూహం’, ‘శపథం’. 2009 నుంచి 2019 ఎన్నికల వరకు ఏపి సిఎం వైఎస్ జగన్ కు సంబందించిన పలు సంఘటనలు ఆధారంగా తెరకెక్కించారు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ప్రకటించారు. అయితే అజ్మల్ అమీర్, ధనంజయ్ ప్రభునే, సురభి ప్రభావతి, రేఖ సురేఖ ప్రధాన పాత్రల్లో పొలిటికల్ సెటైరికల్ గా తెరకెక్కించిన ఈ సినిమాలోని పాత్రలు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా ఉన్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోర్టును ఆశ్రయించడంతో గత ఏడాది డిసెంబరు నుండి ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. చివరకు కోర్టు నుండి అనుమతి సంపాదించిన తరువాత మొదటి భాగం ‘వ్యూహం’ ను మార్చి 2న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసారు. అదే సమయంలో మార్చి 8న ‘శపథం’ కూడా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Ram Gopal Varma Vyuham

అయితే దర్శకుడు రాం గోపాల్ వర్మ ఈ రెండు సినిమాలను అనూహ్యంగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే థియేటర్లలో విడుదలైన ‘వ్యూహం’, శుక్రవారం విడుదల కాబోయే ‘శపథం’ ఈ రెండింటిని వెబ్‌ సిరీస్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్‌ కు ఉంచుతున్నట్లు ప్రకటించారు. ఈ వెబ్ సిరీస్ కు శపథం ఆరంభం ఛాప్టర్-1, శపథం ఆరంభం ఛాప్టర్-2 అనే టైటిల్స్ పెట్టాడు వర్మ. ఈ ఛాప్టర్ లు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం ఏపీ ఫైబర్ నెట్ స్ట్రీమింగ్‌ కాబోతుందని ఆర్జీవి(Ram Gopal Varma) ఓ ప్రకటన ద్వారా తెలియజేశాడు. ఈ వెబ్ సిరీస్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏపీ ఫైబర్ నెట్ ద్వారా పే పర్ వ్యూలో చూసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు… ఏపీ ఫైబర్ నెట్ చైర్మెన్ గౌతం రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే శపథం ఆరంభం ఛాప్టర్-1 ను గురువారం సాయంత్రం ఓటీటీలో ఫ్లాట్ ఫాంలో విడుదల చేయగా… శపథం ఆరంభం ఛాప్టర్-2 ను శుక్రవారం సాయంత్రం ఓటీటీలోనికి అందుబాటులోనికి తీసుకొస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా దర్శకుడు ఆర్జీవీ మాట్లాడుతూ… “డబ్బుల కోసం తీసిన సినిమా కాదిది. డబ్బు కావాలంటే మసాలా సినిమా తీసి ఉండేవాడ్ని. వ్యూహం(Vyuham)-శపథం తీయడానికి కారణం ఏంటంటే… నిజజీవితంలో మన కళ్ల ముందు కనిపిస్తున్న కొంతమంది రాజకీయ నాయకుల నిజస్వరూపాల్ని బట్టబయలు చేయడం మా టార్గెట్. కాబట్టి ఈ సినిమాను ఎక్కువమంది ప్రజలు చూసేలా చేయడం మా లక్ష్యం. అందుకే ముందుగా థియేటర్లలో రిలీజ్ చేశాం. ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ లో వెబ్ సిరీస్ రూపంలో రిలీజ్ చేస్తున్నాం. ఆ తర్వాత ఇతర ఓటీటీ వేదికలపై కూడా ఈ సినిమా రావొచ్చు అని అన్నారు.

Also Read : Priya Bhavani Shankar : తాను ఆ హీరో సినిమాలో లిప్‌లాక్‌కు సిద్ధం అంటున్న ప్రియా

Ram Gopal VarmaSapathamvyuham
Comments (0)
Add Comment