Saree : విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తను 24 ఫ్రేమ్స్ గురించి చెప్పగలిగిన ఏకైక డైరెక్టర్ టాలీవుడ్ లో. తను శివతో దుమ్ము రేపాడు. బాలీవుడ్ ను షేక్ చేశాడు. సత్య, కంపెనీ, డీ , రంగీలా , సర్కార్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి మూవీ ఓ సెన్సేషన్. తనే ఓ ఫ్యాక్టరీగా మారి పోయాడు. కృష్ణవంశీ, పూరీ జగన్నాథ్, వాజ్ పేయ్ లాంటి వాళ్లను తయారు చేశాడు. చెప్పుకుంటూ పోతే ఎంతో మంది తన వద్ద శిక్షణ తీసుకున్న వాళ్లే. ఆయాన్ రాండ్ ఫిలాసఫీని ఎక్కువగా ఇష్టపడే ఆర్జీవీ ఏది చేసినా చర్చకు దారితీసేలా చేస్తుంది.
Saree Movie Updates
మొదట శారీ పేరుతో సినిమా తీస్తున్నట్లు ప్రకటించాడు. ఇందుకు కొత్త అమ్మాయిని ఎంపిక చేశాడు. కానీ ఉన్నట్టుండి తనకు బదులు మరో దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు. శారీ చిత్రం పూర్తయింది. దీనిని పూర్తిగా సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. దీనిని ఈనెల 28న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించాడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma). ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషలలో విడుదల కానుంది.
ఇందులో సత్య, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రలలో నటించారు. నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా రూపొందించారు. సోషల్ మీడియాలో ముక్కు ముఖం తెలియని వాళ్లతో కనెక్ట్ అవుతాం. ఆ తర్వాత మోసపోయామని గ్రహిస్తాం. అలాంటి మోసపోయిన వారి గురించి చెప్పే ప్రయత్నం చేశామన్నారు శారీ మూవీలో. గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించగా ప్రముఖ వ్యాపారవేత్త రవి శంకర్ దీనిని నిర్మిస్తున్నారు.
Also Read : Madam Movie- Shocking Teaser :భయపెట్టిస్తున్న ‘మదం’ టీజర్