Ram Gopal Varma: సోషల్ మీడియా అందుబాటులోనికి వచ్చిన తరువాత చాలా మంది ఓవర్ నైట్ స్టార్లు అయిపోతున్నారు. తమ ట్యాలెంట్ ను ఉపయోగించి ఓ రీల్స్ లేదా వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే… అది కాస్తా వైరల్ అయి సినీ ప్రముఖుల నుండి అనంద్ మహేంద్ర వంటి పెద్ద పెద్ద వ్యాపార వేత్తల వద్దకు క్షణాల్లో చేరుకుంటుంది. దీనితో అటువంటి ట్యాలెంట్ గల వ్యక్తుల కోసం ఎదురుచూసే దర్శకులు… ఆ పోస్టులో ఉన్న వ్యక్తుల వివరాలను తెలుసుకుని మరీ అవకాశాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే క్రియేటివ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కంటికి తారసపడింది ఓ అమ్మాయి వీడియో. అందమైన చీరకట్టులో ఆమె చేసిన ఇన్ స్టా రీల్ కు ఆర్జీవి ఫిదా అయ్యాడు. అంతేకాదు ఈ వీడియోను తన ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేసి తానెవరో తెలిస్తే చెప్పండి అంటూ ట్వీట్ చేసాడు. దీనితో ఎట్టకేలకు ఆమె కేరళకు చెందిన శ్రీలక్ష‍్మి సతీశ్ అని తెలిసింది.
Ram Gopal Varma Saari Movie
సినిమాలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తనను…. ఆర్జీవి వెతుకున్నారని తెలిసి శ్రీలక్ష‍్మి సతీశ్ సంబరపడిపోయింది. ఇంతలోనే ఆమెకు మరో బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చాడు డైరెక్టర్ రాం గోపాల్ వర్మ(Ram Gopal Varma). శారీలో శ్రీ లక్ష్మి సతీశ్ ను చూసి ఫిదా అయిపోయిన ఆర్జీవి… ఏకంగా అదే పేరుతో ఆమెతో సినిమా తీయాలని డిసైడ్ అయిపోయాడు. దీనికి తన ఆర్జీవి డెన్ పతాకంపై అఘోశ్ వైష్ణవం దర్శకత్వంలో శ్రీలక్ష‍్మి సతీశ్ ప్రధాన పాత్రలో శారీ అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించడంతో పాటు ఇంటర్నేషనల్ శారీ డే సందర్భంగా ఆ సినిమా ఫస్ట్ లుక్ ను తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేసారు. దీనితో ఒక్క ఇన్ స్టా రీల్ తో ఆర్జీవి హీరోయిన్ గా మారిపోయావంటూ శ్రీలక్ష‍్మి సతీశ్ కు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read : Hero Karthi: కార్తీ ‘సర్దార్ 2’ కు ముహూర్తం ఫిక్స్