Ram Gopal Varma: వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శివ, గులాబి, క్షణం క్షణ, సత్య, సర్కార్, రక్త చరిత్ర వంటి ఎన్నో తెలుగు, హిందీ సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. గత దశాబ్ధ కాలంలో రాం గోపాల్ వర్మకు చెప్పుకోదగ్గ హిట్ లేనప్పటికీ… అతని సినిమా వస్తుందంటే ఓ సంచలనం. ఆశక్తిరమైన టైటిల్స్, వివాదాస్పదమైన సబ్జెక్ట్స్, సెటైరికల్ క్యారెక్టర్స్ తో సినిమాలు తీసి నిత్యం వార్తల్లో ఉంటారు. ముఖ్యంగా ఏపీలోని అధికార వైసీపీకు అనుకూలంగా… విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన పార్టీలను టార్గెట్ చేస్తూ సినిమాలు తీస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇటీవల రాం గోపాల్ వర్మ తీసిని వ్యూహం, శపథం సినిమాలు వివాదాస్పదంగా మారాయి. ఎట్టకేలకు వ్యూహం సినిమా థియేటర్లలో రిలీజ్ కాగా… శపథం మాత్రం వెబ్ సిరీస్ రూపంలో ఓటీటీలో రిలీజ్ చేసారు. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యారు ఆర్టీవీ. ఇప్పటికే శారీ మూవీని తెరకెక్కిస్తోన్న ఆర్జీవీ… మరో ఆసక్తికర సినిమా ‘నా పెళ్లాం దెయ్యం’ ను ప్రకటించారు.
Ram Gopal Varma Comments Viral
ఆర్జీవీ తన కొత్త సినిమా ‘నా పెళ్లాం దెయ్యం’ పోస్టర్‌ను ఏలాంటి క్యాప్షన్ లేకుండా తన సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. అందులో నా పెళ్లాం దెయ్యం అనే టైటిల్ తోపాటు… తాళి తీసి పడేసినట్లుగా… బ్యాక్‌గ్రౌండ్లో కిచెన్ లో పని చేసుకుంటూ కనిపించే ఓ మహిళను చూపించారు. కాగా… ఈ విషయాన్ని కొన్నాళ్ల క్రితమే ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీ(Ram Gopal Varma) వెల్లడించారు. నా పెళ్లాం దెయ్యం పేరుతో మూవీని తీయబోతున్నట్లు తెలిపారు. నిజానికి పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరూ తమ పెళ్లాం దెయ్యమనే అంటారని… నాకు కూడా నిజ జీవితంలో అలాగే అనిపించిందని అప్పట్లోనే ఆర్జీవీ అన్నారు. కాగా… ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read : Aaron Taylor Johnson: కొత్త జేమ్స్ బాండ్ గా ఆరోన్ టేలర్ జాన్సన్ ?