Ram Gopal Varma : ఆ మంత్రి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పిన సరిపోదు

అంతే కాదు కొండా సురేఖ సమంతకు క్షమాపణ చెప్పడమేంటి అని ఆర్‌జీవీ ప్రశ్నించారు...

Ram Gopal Varma : భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో అక్కినేని ఫ్యామిలీ, సమంతను ఉద్దేశించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ(Ram Gopal Varma) తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ” ఒక మినిస్టర్‌ హోదాలో ఉండి నాగార్జున, నాగ చైతన్య(Naga Chaitanya)లాంటి డిగ్నిఫైడ్‌ కుటుంబాన్ని, సమంత లాంటి ఇండస్ట్రీ గర్వించదగ్గ నటి మీద అంత నీచమైన మాటలనంటాన్ని తీవ్రంగా ఖండించాలి. నాగార్జున కుటుంబాన్ని అత్యంత హార్రిబుల్‌గా అవమానపరిచిన కొండా సురేఖ కామెంట్లకి షాక్‌ అయ్యాను.

తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవడానికీ మధ్యలో ఇండస్ట్రీ, సమాజంలో గౌరవం ఉన్న నాగార్జున ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగడం ఏ మాత్రం కరెక్ట్‌ కాదు. కేటీఆర్‌ దూషించే క్రమంలో అక్కినేని కుటుంబాన్ని అంత దారుణంగా అవమానించటంలో అర్థమేంటో కనీసం ఆవిడకైనా అర్థమయ్యుంటుందో లేదో నాకర్థమవ్వటంలేదు! తనని రఘునందన్‌ ఇష్యూలో ఎవరో అవమానించారనీ అసలు ఈ ఇష్యూతో ఏ మాత్రం సంబంధం లేని నాగార్జున(Nagarjuna), నాగ చైతన్యలను అంతకన్నా దారుణంగా అవమానించటమేంటి? ఫోర్త్‌ గ్రేడ్‌ వెబ్‌సైట్లు కూడా ప్రచురించని జుగుప్సాకరమైన నిందలు తనేదో తన కన్నులతో చూసి తన చెవులతో విన్నట్లు మీడియా ముందు చెప్పడం దారుణం. సీఎం రేవంత్‌ రెడ్డి ఈ విషయంలో వెంటనే స్పందించి ఇలాంటివి మరోసారి జరగకుండా స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇవ్వాలని ఇండస్ర్టీ తరపున కోరుతున్నాం.

Ram Gopal Varma Slams…

అంతే కాదు కొండా సురేఖ సమంతకు క్షమాపణ చెప్పడమేంటి అని ఆర్‌జీవీ ప్రశ్నించారు. సమంతను ఆమె అత్యంత జుగుప్సాకరంగా అవమానించింది. నాగార్జునని, నాగచైతన్యని ఒక మామగారు, భర్త, కోడలిని, భార్యను వాళ్లకు సంబంధించిన ఆస్తి కాపాడుకోవడానికి బలవంతంగా పంపించడానికి ట్రై చేస్తే తను విడాకులు ఇచ్చి వెళ్లిపోయిందని చెప్పడం కన్నా ఘోరమైన అవమానం నేను జీవితంలో వినలేదు. ఇది సమంతను అవమానించడం ఎలా అయింది? వారిద్దరి కోసమే కాకుండా ఇండస్ట్రీలో ఉండే అందరికోసం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని నాగార్జున, చైతన్య సదరు వ్యక్తులకు గుణపాఠం చెప్పాలి’’ అని ఆర్‌జీవీ ట్వీట్‌ చేశారు.

‘‘ఇతరుల వ్యక్తిగత పరిస్థితిని రాజకీయాల కోసం వాడటం నన్నెంతో బాధించింది. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి రాజకీయ లబ్థి కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. వ్యక్తిగత జీవితం, కళల పట్ల పరస్పర గౌరవం, హార్డ్‌వర్క్‌, అంకితభావంతో మా సినీ పరిశ్రమ ఏర్పడింది. బహిరంగ ప్రసంగంలో గౌరవాన్ని కాపాడుకోవలసిన బాధ్యత రాజకీయ నాయకులకు ఉంది. రాజకీయాల్లోకి ఇతరుల వ్యక్తిగత జీవితాలను తీసుకురావడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. ఇందులో భాగమైన వారి కుటుంబానికి బాధ మాత్రమే ఉంటుంది. అటువంటి ముఖ్యమైన నాయకత్వ స్థానాల్లో ఉన్న వ్యక్తులు సంయమనం, సానుభూతి పాటించాలని కోరుతున్నా. మీ చర్యలు, మాటలు జనాల్లో స్ఫూర్తి నింపేలా ఉండాలని కోరుకుంటున్నా’’ అని వెంకటేశ్‌ పేర్కొన్నారు.

Also Read : Vettaiyan Movie : రజనీకాంత్ ‘వెట్టయన్’ ట్రైలర్ పై అభిమానుల ప్రశంసలు

Akkineni Naga ChaitanyaRam Gopal VarmaSamanthaUpdatesViral
Comments (0)
Add Comment