Ram Charan : సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది హీరో రామ్ చరణ్(Ram Charan) గురించి. తను ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనతో కలిసి సినిమా చేస్తున్నాడు. అదే ఆర్సీ16 మూవీ షూటింగ్ జెట్ స్పీడ్ కంటే వేగంగా కొనసాగుతోంది. ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్. ఇందుకు సంబంధించి ఇటీవలే పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు దర్శకుడు. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా అల్లా రఖా రెహమాన్ ను పెట్టుకున్నారు మూవీ మేకర్స్.
Ram Charan – Thaman
ఇదే సమయంలో ఓ వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే తాను తమిళ సినీ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటించిన గేమ్ ఛేంజర్ గురించి. ఆ సినిమాకు సంగీతం అందించాడు ఎస్ఎస్ థమన్. ఈ మూవీ రిలీజ్ అయి బొక్క బోర్లా పడింది. చెర్రీ సినీ కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో దీనిని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. కానీ ఊహించని రీతిలో ఆడక పోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు. ఇదే సమయంలో తను నిర్మించిన మరో చిత్రం సంక్రాంతికి వస్తున్నాం విడుదలైంది. ఎవరూ ఊహించని రీతిలో ఏకంగా రూ. 330 కోట్లకు పైగా వసూలు చేసింది. నిర్మాత దిల్ రాజుకు ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఒక రకంగా తనను గట్టెక్కించిందని చెప్పక తప్పదు.
గేమ్ ఛేంజర్ మూవీ కోసం దిల్ రాజు ఏకంగా రూ. 500 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రచారం కూడా జరిగింది. ఈ సందర్బంగా ఈ సినిమాకు సరైన రీతిలో మ్యూజిక్ ఇవ్వలేదంటూ థమన్ పై కోపంతో చెర్రీ ఉన్నాడని, అందుకే తనను సోషల్ మీడియా వేదికగా అన్ ఫాలో చేసినట్లు ప్రచారం జరిగింది. ఏది ఏమైనా రామ్ చరణ్ కు 2025 ఓ పీడకలగా మిగిలి పోయింది శంకర్ దర్శకత్వం ద్వారా.
Also Read : IPL 2025- Popular Bollywood Actors :బాలీవుడ్ సెలెబ్రిటీలతో ఐపీఎల్ ప్రారంభోత్సవం