Ram Charan: విశాఖ బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్ కుటుంబం !

విశాఖ బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్ కుటుంబం !

Ram Charan: మెగా హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్… ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్‌ షెడ్యూల్‌ ప్రస్తుతం విశాఖపట్నంలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో విశాఖ విచ్చేసిన రామ్ చరణ్ కు మెగా అభిమానులు ఘన స్వాగతం పలికారు. విశాఖపట్నంలో షూటింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. తన అభిమాన హీరోను చూడటానికి పెద్ద ఎత్తున మెగా అభిమానులు షూటింగ్ ప్రాంతానికి చేరుకుంటున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన చరణ్ లుక్ ఇటీవల సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీనితో చెర్రీ అభిమానులు దానిని నెట్టింట వైరల్ చేస్తున్నారు.

Ram Charan In Vizag Today

అయితే షూటింగ్ కు కాస్తా విరామం లభించడంతో… రామ్ చరణ్(Ram Charan) తన భార్య ఉపాసన, కుమార్తె క్లీంకారలతో పాటు తమ పెట్ డాగ్ రైమ్ కలిసి బీచ్ లో సందడి చేసారు. క్లీంకారాకు బీచ్ లోని సముద్రం నీటిని చూపిస్తూ… రైమ్ తో నీటిలో ఆటలాడుతూ చరణ్ ఎంజాయ్ చేసారు. అలాగే ఉపాసనను బీచ్ లో ఉన్న రాళ్ళపైకి తీసుకెళ్లి ఫోటోలు, సెల్ఫీలు దిగారు. ఈ వీడియోలను ఉపాసన తన సోషల్ మీడియా ఇన్‌ స్టా లో షేర్ చేసింది. వైజాగ్ మా హృదయాలను దోచేసింది… క్లీంకారతో ఫస్ట్ బీచ్ ఎక్స్‌పీరియన్స్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇదే వీడియోలో మెగా అభిమానులు రామ్ చరణ్‌ ను గజమాలతో సత్కరించిన దృశ్యాలు కూడా ఉణ్నాయి. దీనితో క్లీంకారతో ఎత్తుకుని బీచ్‌లో ఆడుకుంటున్న దృశ్యాలు అభిమానులకు కనువిందు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

Also Read : Ram Charan : చెర్రీ RC 16 లో బాలీవుడ్ బడా స్టార్ బాబీ డియోల్..!

Klimkararam charanUpasana Konidela
Comments (0)
Add Comment