Ram Charan: ‘కల్కి’ నిర్మాతలకు రామ్‌చరణ్‌ సర్‌ప్రైజ్‌ ! థాంక్స్‌ చెప్పిన స్వప్నదత్‌ !

‘కల్కి’ నిర్మాతలకు రామ్‌చరణ్‌ సర్‌ప్రైజ్‌ ! థాంక్స్‌ చెప్పిన స్వప్నదత్‌ !

Ram Charan: ప్రభాస్‌ హీరోగా నాగ్‌అశ్విన్‌ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ ప్రభంజనం సృష్టించింది. తాజాగా ఈ సినిమాను గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ ప్రశంసించారు. నిర్మాతలకు ఒక నోట్‌ పంపారు. కల్కి చూసిన ఆయన ఈ సినిమా అద్భుతమని ప్రశంసించారు. నిర్మాతలకు పుష్పగుచ్ఛాలు పంపారు. వాటితో పాటు ‘కల్కి చూసిన అనుభవాన్ని మర్చిపోలేం.. అదో అద్భుతం. టీమ్‌కు అభినందనలు’ అని రాసిన నోట్‌ను పంపారు. దీంతో రామ్ చరణ్‌కు థాంక్స్ చెబుతూ స్వప్నదత్‌ ఆయన పంపిన నోట్‌ను పంచుకున్నారు. ‘లవ్‌ ది లవ్‌’ అనే క్యాప్షన్‌ పెట్టారు.

Ram Charan Surprise..

జూన్‌లో ప్రేక్షకుల ముందుకువచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో దీని సీక్వెల్‌ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తాజాగా దీని పార్ట్‌ 2 గురించి నిర్మాతలు మాట్లాడుతూ.. జనవరి, ఫిబ్రవరిలో మొదలుపెట్టనున్నట్లు చెప్పారు. చిత్రీకరణ ప్రారంభమైన తర్వాత పార్ట్‌ 2కు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌ ఇస్తామన్నారు. సీక్వెల్‌ షూటింగ్‌ను మొదటిభాగం చిత్రీకరణ సమయంలోనే కొంతమేర పూర్తి చేశారు. కొన్ని కీలక సన్నివేశాలు, వీఎఫ్‌ఎక్స్‌ పనులు మాత్రమే పూర్తిచేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

Also Read : The Buckingham Murders: కరీనా కపూర్‌ ‘ది బకింగ్‌హామ్‌ మర్డర్స్‌’ ట్రైలర్‌ రిలీజ్ !

C. Aswani DuttKalki 2898 ADNag Ashwinram charan
Comments (0)
Add Comment