Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా సినిమా ‘గేమ్ ఛేంజర్’. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించగా… ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు, రచయిత కార్తిక్ సుబ్బరాజ్ అందించిన పొలిటికల్, యాక్షన్ కథను ‘గేమ్ ఛేంజర్(Game Changer)’ గా శంకర్ తెరకెక్కిస్తున్నారు. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై జీ స్టూడియోస్ అసోసియేషన్ లో ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే బుధవారం రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి ‘జరగండి’ అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. దేశ వ్యాప్తంగా 150 పైగా థియేటర్స్‌లో ఈ పాటను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ పాట యూ ట్యూబ్ ను షేక్ చేస్తుంది. థమన్ మాస్ బీట్స్ కు కియరా, రామ్ చరణ్ డ్యాన్స్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు.
Game Changer Movie Updates
ఇక ‘జరగండి’ పాట విషయానికి వస్తే… మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ సంగీత సారథ్యంలోని ఈ పాటను అనంత శ్రీరామ్ రాయగా దలేర్ మెహందీ, సునిధీ చౌహాన్ ఆలపించారు. రామ్ చరణ్, కియార అద్వానీ జంట స్క్రీన్ పై చూడ ముచ్చటగా ఉంది. ఇక డైరెక్టర్ శంకర్ మేకింగ్ లో తనదైన భారీతనాన్ని చూపించబోతున్నారని పాటలోని కొన్ని సన్నివేశాలను చూస్తుంటేనే అర్థమవుతుంది. RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ హీరోగా వస్తోన్న సినిమా కావటంతో ఈ సినిమా కోసం మెగా అభిమానులు… సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేస్తున్నారు.
Also Read : Trisha Krishnan : త్రిష ఒక్క సినిమాకు అన్ని కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది..?