Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం పెద్ది(Peddi). శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్, గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పించేలా చేశాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో శాండిల్ వుడ్ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ , ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా నటిస్తుండడంతో సినిమాపై అంచనాలు మరింత పెంచేలా చేశాయి.
Ram Charan Peddi Movie Updates
మూవీని ప్రతిష్టాత్మకంగా తీసే ప్రయత్నంలో బిజీగా ఉన్నాడు దర్శకుడు. భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నారు. ఈ సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంతో వస్తున్నట్లు టాక్. ఇంకా అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు బుచ్చిబాబు సన. గ్లోబల్ స్టార్ ఇమేజ్ స్వంతం చేసుకున్న నటుడు రామ్ చరణ్. తను డైనమిక్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ లో నటించాడు. ఇటీవలే రిలీజ్ అయ్యింది. అది బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీనిని నిర్మాత దిల్ రాజు ఏకంగా రూ. 500 కోట్లు ఖర్చు చేశాడు.
ఇదే సమయంలో తను తీసిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం సక్సెస్ కావడంతో ఊపిరి పీల్చుకున్నాడు.
ఇక డైనమిక్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా పేరొందిన బుచ్చిబాబు సన తన శక్తియుక్తుల్ని ధారపోసి పెద్దిని తీస్తున్నాడు. టైటిల్ ను ఫిక్స్ చేశాడు. అయితే రిలీజ్ చేసిన పోస్టర్ పై కొంత వ్యతిరేకత వచ్చింది. ఇది పూర్తిగా సుక్కు తీసిన పుష్ప మూవీలో అల్లు అర్జున్ ను కాపీ కొట్టినట్లుగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మండి పడుతున్నారు మెగా ఫ్యాన్స్.
Also Read : Beauty Sree Leela :కెమిస్ట్రీ పండింది డేటింగ్ కుదిరింది