నెట్టింట్లో రామ్ చరణ్ వైరల్ గా మారారు. ఆయన తాజాగా ముంబై లోని సిద్ది వినాయక ఆలయాన్ని సందర్శించారు. ఇదే సమయంలో ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీని కలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా చెర్రీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారులు రామ్ చరణ్ కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇదిలా ఉండగా ప్రతి సంవత్సరం చెర్రీ అయ్యప్ప దీక్ష చేపడతారు. ఈసారి కూడా ఇదే దీక్షను వినాయక టెంపుల్ లో విరమించడం విశేషం.
అదే సమంలో ప్రసిద్ది చెందిన వినాయక ఆలయాన్ని సందర్శించారు జార్ఖండ్ డైనమెంట్ ఎంఎస్ ధోనీ.
ఇద్దరూ ఒకరినొకరు కలుసుకున్నారు. ఎస్ఎస్ రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఈసారి ఆస్కార్ అవార్డు అందుకుంది నాటు నాటు పాటకు గాను.
ఇందులో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ తేజ కూడా నటించారు. దీనిని చంద్రబోస్ రాస్తే , ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఆ తర్వాత చెర్రీ నేషనల్ స్టార్ గా మారి పోయారు. ప్రస్తుతం ధోనీ గురించి ఇక చెప్పేది ఏముంది.