Ram Charan : రామ్ చరణ్ తో సినిమాపై కీలక అప్డేట్ ఇచ్చిన కృష్ణవంశీ

ఇందులో అంజలి, కియారా అద్వానీ, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషిస్తుండగా....

Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ట్రిపుల్ ఆర్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాందిచుకున్న ఈ హీరో.. ఇప్పుడు డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో మొదటిసారి రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారు చరణ్(Ram Charan). ఇప్పటికే ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్, జరగండి సాంగ్ మినహా మరో అప్డేట్ రాలేదు. కానీ ఈ మూవీ షూటింగ్ నుంచి అనేక ఫోటోస్ లీక్ అయ్యాయి. చరణ్ లుక్స్, ఫైట్ సీన్స్ నెట్టింట హల్చల్ చేశాయి.

ఇందులో అంజలి, కియారా అద్వానీ, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషిస్తుండగా..ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ అడియన్స్ ముందుకు రానుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో గేమ్ ఛేంజర్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ తర్వాత ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేయనున్నారు చరణ్(Ram Charan). ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటించనుండగా.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇవే కాకుండా ఇప్పుడు రామ్ చరణ్, డైరెక్టర్ కృష్ణవంశీ కాంబో గురించి వార్తలు వినిపిస్తున్నాయి.

Ram Charan Movie Updates

మురారీ రీరిలీజ్ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన డైరెక్టర్ కృష్ణవంశీ.. రామ్ చరణ్ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. రామ్ చరణ్ కు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఇస్తానని ప్రామిస్ చేశారు.. గుర్తుందా..? అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. స్క్రిప్ట్ రెడీగా ఉందని.. అలాగే రామ్ చరణ్ తో సినిమా చేసేందుకు తాను కూడా సిద్ధంగానే ఉన్నానని.. చరణ్ ఎప్పుడు ఒకే అంటే అప్పుడు సినిమా తీస్తానని అన్నారు. దీంతో చరణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు.

అలాగే కృష్ణవంశీ, చరణ్ కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ పై ఇప్పుడే మంచి క్యూరియాసిటీ ఏర్పడింది. ఈ క్రమంలో మరోసారి చరణ్ తో చేయబోయే ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు డైరెక్టర్ కృష్ణవంశీ. రామ్ చరణ్ కు మంచి స్టోరీ చెప్పి ఈసారి మూవీ ఇండస్ట్రీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను సర్ అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేయగా కృష్ణవంశీ రిప్లై ఇచ్చారు. కొన్ని రోజుల క్రితమే చరణ్ కోసం స్క్రిప్ట్ రెడీ చేశానని.. ఎప్పుడు ఒకే అంటే అప్పుడు సిద్ధమని అన్నారు. ప్రస్తుతం తాను సిద్ధంగానే ఉన్నాని.. కానీ చరణ్ ఇప్పుడు బిజీగా ఉన్నాడని.. ఇలాగే తన లైఫ్ బిజీగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ గురించి చర్చ నడుస్తుంది.

Also Read : Average Student Nani: ఆకట్టుకుంటున్న ‘యావరేజ్‌ స్టూడెంట్‌ నాని’ టీజర్‌ !

Global Star Ram CharanKrishna VamsiMoviesTrendingUpdatesViral
Comments (0)
Add Comment