Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్ కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం పెద్ది. శరవేగంగా షూటింగ్ కొనసాగుతోంది. ఇటీవలే మూవీ మేకర్స్ టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రానికి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ ఎత్తున ఖర్చు చేస్తూ తీస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అధికారికంగా టైటిల్ ప్రకటించినప్పటి నుండి సంచలనం సృష్టిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.
Ram Charan Peddi Movie Updates
ఈ పెద్ది(Peddi) సినిమా పూర్తిగా గ్రామీణ క్రీడా నేపథ్యంగా వస్తోంది. ఇందులో రామ్ చరణ్, జాన్వీ కపూర్ తో పాటు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇది పూర్తిగా ఉత్కంఠ భరితమైన స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది. టైటిల్ వెల్లడితో పాటు మేకర్స్ రామ్ చరణ్ ఫస్ట్ లుక్ కూడా ఆవిష్కరించారు.
ఇది అభిమానుల నుండి అపారమైన ప్రశంసలను పొందింది. ఇప్పుడు ఉగాది సందర్భంగా, బృందం ఒక ఉత్తేజకరమైన అప్‌డేట్‌ను పంచుకుంది. ఈ చిత్రం నుండి మొదటి షాట్ శ్రీరామ నవమి 6న విడుదల కానుంది. బహుళ-క్రీడా నేపథ్యంలో రూపొందించబడిన ఈ చిత్రంలో రామ్ చరణ్ సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో జగపతి బాబు కీ రోల్ పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తుండగా ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Also Read : Hero Vikram-Veera Dheera Sooran 2:ఆకట్టుకుంటున్న వీర ధీర సూర -2