Unstoppable 4 : అన్ స్టాపబుల్ సీజన్ 4 కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

అన్ స్టాపబుల్ సీజన్ 2లో పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా హాజరు అయ్యారు...

Unstoppable 4 : ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అన్ స్టాపబుల్(Unstoppable 4) షో నాలుగో సీజన్‌కు చేరుకుంది. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న ఈ షో మొదటి ఎపిసోడ్ దీపావళి కానుకగా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన షో ట్రైలర్ ఆడియెన్స్‌లో ఇప్పటి వరకు లేనంత బజ్ క్రియేట్ చేసింది. ఇప్పటికే అల్లు అర్జున్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, హీరో సూర్యలతో ఒక్కో ఎపిసోడ్ షూట్ ముగిసింది. ఈ షోకి నెక్స్ట్ ఒక గ్లోబల్ స్టార్ ఎంట్రీ ఇయ్యనున్నారు. దీంతో ఇది గేమ్ ఛేంజింగ్ ఎపిసోడ్ కానుందని తెలుస్తోంది.

Unstoppable 4 Updates

గ్లోబల్‌స్టార్‌ రామ్‌ చరణ్‌(Ram Charan), సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘గేమ్‌ చేంజర్‌’. కాంబినేషన్‌ రీత్యా ఈ చిత్రంపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. అయితే సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న వేళా మరింత బజ్ క్రియేట్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ దీపావళికి టీజర్ రిలీజ్ చేయడంతో పాటు ప్రమోషన్స్‌లో జోరు పెంచేందుకు బాలయ్య అన్ స్టాపబుల్ షోకి గెస్ట్ గా రామ్ చరణ్ హాజరు కానున్నాడు. చరణ్‌తో పాటు కియారా అద్వానీ లేదా డైరెక్టర్ శంకర్ కూడా ఈ షోలో కనిపించనున్నట్లు టాక్. దీంతో ‘గేమ్‌ చేంజర్‌’ గేరు మార్చి మరింత బజ్ క్రియేట్ చేయనుంది.

అన్ స్టాపబుల్ సీజన్ 2లో పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా హాజరు అయ్యారు. ఈ క్రమంలోనే బాలయ్య చెర్రీకి కాల్ చేయించారు. ఆ సందర్భంలో చరణ్ మాట్లాడుతూ.. “బాలకృష్ణ గారు ఆహ్వానిస్తే షోకి తప్పకుండా వస్తానని, బాలయ్య ఈజ్ ట్రూలీ అన్ స్టాపబుల్, షోని చూస్తుంటే ఎప్పుడెప్పుడు గెస్ట్‌గా హాజరు కావాలని ఉందని” చెప్పారు. కాగా చంద్రబాబు నాయుడితో షూట్ చేసిన ఎపిసోడ్ దీపావళి కానుకగా ఫస్ట్ రిలీజ్ కానుంది.

Also Read : The Legend of Hanuman : ఓటీటీకి ‘ది లెజెండ్ అఫ్ హనుమాన్’ కొత్త సీజన్

BalakrishnaGlobal Star Ram CharanNational. TrendingUnstoppableUpdatesViral
Comments (0)
Add Comment