Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు దైవ భక్తి ఎక్కువ. తండ్రి చిరంజీవి అడుగుజాడల్లో పలుమార్లు అయ్యప్ప మాల వేసుకున్నారు. దీనితో పాటు ఏ పండుగనైనా ఇంట్లో కుటుంబ సభ్యులతో జరపుకోవడం… అవకాశం దొరికినప్పుడల్లా గుళ్లు గోపురాలకు తిరగడం కూడా మనం చూస్తున్నాం.
ఈ నేపథ్యంలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ లో మైసూర్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్(Ram Charan)… కాస్తా గ్యాప్ దొరికేసరికి చాముండేశ్వరి దేవి ఆలయాన్ని సందర్శించి ఆదివారం తెల్లవారు జామున ప్రత్యేక పూజులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు రామ్ చరణ్ కు సాంప్రదాయ బద్దంగా స్వాగతం పలికారు. రామ్ చరణ్ వెంట ‘గేమ్ ఛేంజర్’ సినిమా యూనిట్ సభ్యులు కూడా ఉన్నారు.
దీనితో చాముండేశ్వరి దేవి సన్నిధిలో కోలహలం నెలకొంది. చాముండేశ్వరి దేవి సన్నిధిలోని రామ్ చరణ్ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Ram Charan – శంకర్ దర్శకత్వంలో శరవేగంగా ‘గేమ్ ఛేంజర్’
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ కాంబోలో శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నా సినిమా ‘గేమ్ ఛేంజర్’. పొలిటికల్, యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అడ్వాణీ నటిస్తుండగా అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, నవీన్ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.
గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకోవడంతో…. రామ్ చరణ్ తరువాత చిత్రం ఆర్‌సీ 16 గా ఉప్పెన ఫేం దర్శకుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కనున్నట్లు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీ ప్రొడెక్షన్ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి.
Also Read : Rithika Singh: రజనీకాంత్ షూటింగ్ గాయపడ్డ హీరోయిన్