Ram Charan : మరో అరుదైన గుర్తింపు సంపాదించిన గ్లోబల్ స్టార్ చరణ్

ఈ విష‌య‌మై ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ టీమ్ మాట్లాడుతూ...

Ram Charan : గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఖాతాలో మ‌రో అరుదైన గుర్తింపు వ‌చ్చి చేరింది. అస్ట్రేలియాలో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ తన 15వ ఎడిషన్‌కు రామ్ చరణ్ ను గౌరవ అతిథిగా ప్రకటించింది. అంతేగాక ఆయ‌న‌ భారతీయ సినిమాకి చేసిన సేవలకు గానూ ‘భారతీయ కళ మరియు సంస్కృతికి అంబాసిడర్’ బిరుదును కూడా ప్రదానం చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ గుర్తింపు ద‌క్కించుకున్న తొలి భార‌తీయ సెల‌బ్రిటీగా రికార్డుల్లోకెక్కాడు. దీంతో ఇప్పుడు ఈ వార్త సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోండ‌గా అభిమానుల గ‌ర్వంగా ఫీల‌వుతున్నారు.

Ram Charan….

ఈ విష‌య‌మై ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ టీమ్ మాట్లాడుతూ.. ఈ సంస్థ‌ ఏర్ప‌డి 15 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంటున్న సంద‌ర్భంగా ఈ 15వ ఎడిషన్ కార్య‌క్ర‌మానికి రామ్ చరణ్(Ram Charan) హాజరు కానుండ‌డం ఒక మరపురాని సంఘటనగా నిలిచిపోతుందని పేర్కొంది. ఈ సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ న‌టించిన ప్ర‌ముఖ చిత్రాల‌ను కూడా ప్ర‌ద‌ర్శించ‌నున్న‌ట్లు తెలిపింది. ఆగ‌స్టు 15 నుంచి 25 వ‌ర‌కు ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో జరిగే ఈ ప్రతిష్టాత్మకమైన వేడుకకు రామ్ చరణ్ పాల్గొన‌నున్నాడు.

ఉత్సవానికి ఆహ్వ‌నంపై రామ్ చరణ్ స్పందిస్తూ.. “ ఓ అంతర్జాతీయ వేదికపై భారతీయ సినిమా గొప్పతనాన్ని తెలియ‌జేస్తున్న‌ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌లో భాగమైనందుకు చాలా గౌరవంగా భావిస్తున్నా, మన చిత్ర పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించడం, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు , సినీ ప్రముఖులతో కనెక్ట్ అవ్వడం ఎంతో సంతృప్తిని ఇస్తుంద‌ని అన్నారు. RRR విజయం దానికి ప్రపంచవ్యాప్తంగా ఇంత గుర్తింపు , ప్రేమ ద‌క్క‌డం ఎన్న‌డూ మ‌రువ‌లేన‌ని ఈ క్షణాన్ని అక్క‌డి ప్రేక్షకులతో పంచుకోవడానికి ఎదురు చూస్తున్నాన‌ని అన్నారు.

Also Read : Fifty Shades of Grey OTT : ఓటీటీలో వర్షాకాలంలో వేడిని పుట్టించే రొమాంటిక్ సినిమా

National. Trendingram charanUpdatesViral
Comments (0)
Add Comment