Game Changer Movie : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా నుంచి సెకండ్ సింగల్

దీంతో అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు...

Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ మూవీపై ఎటువంటి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ ఈ మూవీ నుంచి ఈ మధ్యకాలంలో ఎటువంటి అప్‌డేట్ రాకపోవడంతో.. నిరాశకు లోనవుతున్న ఫ్యాన్స్ చిత్రయూనిట్‌పై సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. దర్శకుడు శంకర్‌ను, నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ను ట్యాగ్ చేస్తూ.. నానా యాగీ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో నెల రోజుల క్రితం వినాయక చవితిని పురస్కరించుకుని ఓ రామ్ చ‌ర‌ణ్‌ పోస్టర్‌తో అప్డేట్ ఇచ్చారు.

Game Changer 2nd Single..

అయితే తాజాగా ఈ రోజు (బుధ‌వారం) ‘గేమ్ చేంజర్’ సెకండ్ సింగిల్ రా మ‌చ్చ మ‌చ్చ అంటూ సాగే త్వ‌ర‌లోనే పాట‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. దీంతో అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. డిసెంబ‌ర్‌లో సినిమా విడుద‌ల నేప‌థ్యంలో మేక‌ర్స్ ఇప్ప‌టికైనా అప్డేట్ ఇచ్చార‌ని, ఇక‌పై రెగ్యుల‌ర్‌గా అప్డేట్స్ ఇవ్వాల‌ని కోరుతున్నారు. ప్ర‌స్తుతం ఈ పాట‌కు సంబంధించిన అప్డేట్ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది.

Also Read : Devara : ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో దూసుకుపోతున్న ‘దేవర’

Cinemagame changerGlobal Star Ram CharanTrendingUpdatesViral
Comments (0)
Add Comment