Game Changer : గేమ్ ఛేంజర్ మేకర్స్ దాదాపు 4-5 నెలలుగా ‘జరగండి… జరగండి’ అనే పదాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. దీపావళి కానుకగా ‘జరగండి’ పాటను విడుదల చేయనున్నట్టు గతేడాది నవంబర్‌లో చిత్రబృందం ప్రకటించింది. కొన్ని కారణాల వల్ల ఈ పాట విడుదల కాలేదు. దీంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు చిత్రబృందంపై విమర్శలు కూడా చేశారు. ఎటువంటి ఫలితాలు లభించలేదు. అయితే ఎట్టకేలకు ఈ పాట ప్రేక్షకులకు చేరువవ్వనుంది. చాలా రోజులుగా గేమ్ ఛేంజింగ్ అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు దిల్ రాజు బృందం శుభవార్త అందించింది. ‘జరగండి జరగండి’ పాటను బుధవారం ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మెగా మాస్ బ్లాస్ట్ రాబోతుంది అంటూ కొత్త పోస్టర్ ని షేర్ చేసారు. ఇప్పుడు రామ్ చరణ్(Ram Charan) ఫ్యాన్స్ మంచి మూడ్ లో ఉన్నారు.
Game Changer Update
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. కియారా అద్వానీ కథానాయిక. ఒక పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్. తమన్ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Also Read : Manamey Movie : శర్వానంద్ నటించిన 35 వ చిత్రం ‘మనమే’ నుంచి సరికొత్త అప్డేట్