Ram Charan: తల్లి కోసం చెఫ్ గా మారిన రామ్ చరణ్ ! భర్త, అత్త కోసం కేమరాఉమెన్ అయిన ఉపాసన !

తల్లి కోసం చెఫ్ గా మారిన రామ్ చరణ్ ! భర్త, అత్త కోసం కేమరాఉమెన్ అయిన ఉపాసన !

Ram Charan: ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు కొత్త అవతారం ఎత్తారు. ఏ మాత్రం ఖాళీ దొరికినా అమ్మ కొంగుచాటు బిడ్డగా వంటింట్లో సందడి చేసే రామ్ చరణ్(Ram Charan)… మహిళా దినోత్సవం సందర్భంగా తన తల్లి సురేఖ కోసం చెఫ్ అవతారం ఎత్తారు. పాక శాస్త్రంలో తన ప్రావీణ్యం చూపించి తల్లి సురేఖ కోసం పన్నీర్ టిక్కా అనే వంటకాన్ని తయారు చేసాడు. దీనితో వంటింట్లో తల్లీకొడుకుల సందడి చూసిన మెగా కోడలు ఉపాసన… తన భర్త చెర్రీ, అత్త సురేఖ కోసం కెమరా ఉమన్ అవాతారం ఎత్తింది. వంటింట్లో సందడిని తన ఫోన్ లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఉపాసన పోస్ట్ చేసిన వీడియాలో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Ram Charan – ఉపాసన పోస్ట్ చేసిన వీడియోలో ఏముందంటే ?

అత్త‌మ్మ గారండి మీ కిచెన్‌లో ఏం అవుతుంది… రామ్‌చ‌ర‌ణ్ గారు ఏం వండుతున్నారండి అంటూ ఉపాసన వారిని ప్రశ్నిస్తూ ఉన్న వీడియోను రికార్డ్ చేసింది. చివ‌ర‌లో ప్రతిరోజూ ఉమెన్స్ డే అయితే బాగుంటుందంటూ ముగించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైర‌ల్ అవుతోంది. ఉమెన్స్‌ డే సందర్భంగా సురేఖ, అంజనాదేవితో దిగిన ఫొటోని ఉపాసన ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. 60 ఏళ్ల వయసులో తన అత్తయ్య వ్యాపార రంగంలోకి అడుగుపెట్టినందుకు సంతోషంగా ఉందన్నారు. వయసుతో సంబంధం లేకుండా తన అభిరుచిని ఫాలో అయ్యి… ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. మరెంతోమంది అమ్మలు, అత్తయ్యలు వ్యాపార రంగంలోకి అడుగుపెడితే మన దేశం గొప్పగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

Also Read : Nandamuri Balakrishna: వేటకు దిగిన సింహం ! ‘NBK 109’ ఫస్ట్ గ్లింఫ్స్ రిలీజ్ !

ram charanUpasana Konidela
Comments (0)
Add Comment