Ram Charan : ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇతర కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణం చేసారు. ఇప్పటికే ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి కూడా కుటుంబ సమేతంగా హాజరయ్యారు.
Ram Charan Visited
ప్రమాణ స్వీకారోత్సవానికి పవన్ కుమారుడు అఖిలా నందన్, కూతురు ఆద్య, సాయి ధరమ్ తేజ్, నాగబాబు కూడా హాజరయ్యారు. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా బాబాయ్ పవన్ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చాడు. చరణ్ రాగానే ప్రమాణ స్వీకార మందిరంలో సందడి నెలకొంది. చరణ్‌తో సెల్ఫీలు దిగుతూ అభిమానులు తమ ఉత్సాహాన్ని ప్రదర్శించారు. రామ్ చరణ్ ఎవరినీ నిరాశ పరచకుండా సెల్ఫీ అవకాశాన్ని అందించాడు.
Also Read : Adah Sharma : ఆ రెండు సినిమాల కారణంగానే వ్యాధి బారిన పడిందా..?